తెలంగాణ

రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టరేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: రాష్ట్రంలో నర్సింగ్ విభాగానికో ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు. గురువారం నాడు శాసనసభలో డాక్టర్ లక్ష్మణ్, ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ నర్సింగ్ డైరెక్టరేట్ అవసరం ఉందని అన్నారు. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు కూడా పరిశీలనలో ఉందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో 13496 పోస్టులను భర్తీచేసేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని చెప్పారు. కెసిఆర్ కిట్ల ద్వారా గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడ్డాయని అన్నారు. ఇప్పటికే పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు వివిధ కేటగిరి పోస్టుల భర్తీ బాధ్యత అప్పగించామని, అయితే జోనల్, వెయిటేజీ తదితర సమస్యలతో కొంత జాప్యం జరిగిందని, వాటన్నింటినీ పరిష్కరించడమైందని అన్నారు.
గాంధీ ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ అనుమతి లేకుండా నియమించడంతో వారి జీతాల చెల్లింపులో జాప్యం జరిగిందని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు ఇస్తుందని, వారి బకాయిలను చెల్లిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితులను బాగా మెరుగుపరిచామని, గతంలో ప్రభుత్వం ఆస్పత్రులను, పిహెచ్‌సిలను మంజూరు చేసినా, సిబ్బందిని మాత్రం మంజూరు చేయలేదని, దాంతో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని మంత్రి అన్నారు. నర్సుల కౌశలాలను పెంచేందుకు దక్షత పేరిట ఒక కార్యక్రమం అమలుచేస్తున్నామని అన్నారు.ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో నర్సుల ఖాళీలను ఒప్పంద, పొరుగుసేవల ప్రాతిపదికన ఇప్పటికే భర్తీ చేశారని తెలిపారు.