తెలంగాణ

అన్ని సొసైటీల్లో ఒకే మెనూ, వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ, బిసి , మైనార్టీ , జనరల్ , కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో విద్యార్ధులందరికీ ఒకే రకమైన భోజన వసతులు, వౌలిక వసతులు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కావల్సిన నిధులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ఒకే రాష్ట్రంలో వివిధ విద్యాసంస్థల్లో వివిధ పద్ధతులు ఉండటం వల్ల పిల్లల్లో బేధ భావం ఏర్పడుతుందని చెప్పారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు మంచి మెనూ ఇస్తున్నారని అదే సౌకర్యం మిగిలిన విద్యార్థులకూ అందించాలని అన్నారు. మెనూ, సౌకర్యాల కల్పనకు ఏవిధమైన గ్యాప్స్ ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. అన్ని సొసైటీల కింద ఉన్న విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ట్రాక్ సూట్స్, బ్లాక్ షూస్, బెల్టు, మ్యాట్రస్, యూనిఫారం, టవల్, బెడ్ షీట్లు అందించాలని అన్నారు. తక్కువ మంది విద్యార్థులున్నా ఎక్కువ మంది ఉన్నట్టు చూపించే విధానానికి స్వస్తి పలకాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో హాజరు నమోదుచేయాలని, దానివల్ల ఏ రోజు ఎంత మంది విద్యార్థులున్నారో తెలుస్తుందని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్నామని సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ చెప్పారు. కమాండ్ కంట్రోల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేశామని తలిపారు. ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు జారీ చేశామని తెలిపారు. ఆన్‌కాల్‌లో డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.అస్వస్థతకు గురైతే ఆ విద్యార్థి మళ్లీ కోలుకునే వరకూ నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో కెజిబివిలు, మోడల్ స్కూళ్లలో బయోమెట్రిక్ మిషన్లు, సిసి కెమరాలు, బయోమెట్రిక్ మిషన్లు, సిసి కెమరాలు, ఆర్వో ప్లాంట్లు, డ్యుయల్ డిస్క్‌లు, డిజిటల్ క్లాసులు, ఫర్నీచర్ ఇచ్చారని వివరించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్సీ అభివృద్ధి ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్ మిశ్రా,సీనియర్ అధికారులు ఉమర్ జలీల్, మహేశ్ దత్తా ఎక్క, ప్రవీణ్ కుమార్, కిషన్, మల్లయ్య భట్టు, శ్రీహరి, సత్యనారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
పంజాబ్ బృందం రాక
తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వ నియంత్రణ విధానాన్ని అధ్యయనం చేయడానికి పంజాబ్ నుండి సాంకేతిక విద్యామంత్రి చరణ్ జిత్ సింగ్ నేతృత్వంలోని అధికారుల బృందం తెలంగాణకు వచ్చింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డిని ఇతర సిబ్బందిని కలిసిన బృందం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసింది. ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించే అంశంపై వివిధ రాష్ట్రాల్లో పద్ధతులను అధ్యయనం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. తమ రాష్ట్రంలో 8 ప్రభుత్వ వర్శిటీలు, 23 ప్రైవేటు వర్శిటీలు ఉన్నాయని వారు చెప్పారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్యావిధానాన్ని వివరించారు.
అదనపు ఫీజు వసూలుచేస్తే కఠిన చర్యలు
పరీక్ష ఫీజును అధికంగా వసూలు చేస్తే కార్పొరేట్ కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులు , సెకండియర్ ఆర్ట్సు విద్యార్థులు 450 రూపాయిలు చెల్లిస్తే సరిపోతుందని, సెకండియర్ సైన్స్ విద్యార్థులు మాత్రం 610 రూపాయిలు చెల్లించాలని, ప్రాక్టికల్స్ లేని ఒకేషనల్ విద్యార్థులు 450, ప్రాక్టికల్స్ ఉన్న వారు 610 రూపాయిలు చెల్లించాలని ఆయన వివరించారు.