తెలంగాణ

స్కూల్ బస్సుకు విద్యుత్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, నవంబర్ 16: బడి పిల్లలను తీసుకొని వచ్చిన బస్సును పార్కింగ్ చేయడానికి వెనుకకు తీస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి బస్సుకు నిప్పంటుకుంది. టైర్లు కాలిపోవడాన్ని గమనించిన డ్రైవర్ బస్సులో నుండి కిందికి దూకినా బస్సుకు తాకడంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందగా..క్లీనర్ కిందకి దూకి బతికి బయటపడ్డాడు..వివరాల్లోకి వెళ్తే .. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గల మంజీరా విద్యాలయం హైస్కూల్ వద్ద గురువారం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన మునిగండ్ల రమేష్ (28) సుమారు గత పది సంవత్సరాలుగా మంజీరా విద్యాలయం బస్సును నడుపుతున్నాడు. రోజుమాదిరిగా పిల్లలను తీసుకొచ్చి స్కూల్లో దించి పాఠశాల ముందు పార్కింగ్ చేశాడు. అక్కడ కొందరు వ్యక్తులు మట్టిని పోస్తుండడంతో ఇరుగ్గా ఉందని డ్రైవర్ స్కూల్ సమీపంలో గల ఖాళీ ప్రదేశంలో బస్సును పార్కింగ్ చేయడానికి వెళ్లగా 11 కేవీ విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలాయి. బస్సులో నుండి పొగలు రావడం.. మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన క్లీనర్ బిక్షపతి బస్సులో నుండి కిందకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. డ్రైవర్ రమేష్ కూడా బస్సులో నుండి కిందకి దూకి తిరిగి బస్సుకు తగిలాడు. దీంతో షాక్‌కు గురికాగా మరో డ్రైవర్ గమనించి కాపాడే ప్రయత్నం చేశాడు. అప్పటికే రమేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో కామారెడ్డి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం శవాన్ని మృతుని స్వగ్రామానికి తరలించారు. కాగా, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం సంభవించిందని మృతుని అక్క నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ నాగార్జున్‌గౌడ్ తెలిపారు. బస్సు డ్రైవర్ రమేష్ మృతితో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, కల్వకుంట గ్రామస్థులు, కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు.