తెలంగాణ

ఎస్సీ సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: షెడ్యూల్డు కులాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి అగ్రతాంబూలం ఇస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఎస్సీ,ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రతి పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నామని అన్నారు. శుక్రవారం నాడు శాసనసభలో ఎస్ ఎ సంపత్‌కుమార్, తాటివర్తి జీవన్‌రెడ్డి, జె గీతారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ ఎస్సీల అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రతి పైసా వివరాలతో పెన్‌డ్రైవ్‌లో సభ్యులకు అందించామని అన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చట్టం చేసిందని అన్నారు. ప్రగతి పద్దు కింద మొత్తం కేటాయింపు 88వేల 71 కోట్లు కాగా, ఇంత వరకూ 33వేల 462 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ప్రగతి పద్దు కింద ఎస్సీల అభివృద్ధికి అధికంగానే ఖర్చు చేశామని అన్నారు. ఎస్సీ ప్రత్యేక నిధి కింద 14375.13 కోట్లు కేటాయించగా, ఇంత వరకూ 5475.02 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఇక ఎస్టీ ప్రత్యేక నిధి కింద 8165.87 కోట్లు కేటాయించగా, 3359.37 కోట్లు ఖర్చు చేశామని అన్నారు.
ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని లక్ష పేజీల్లో పొందుపరిచి పెన్ డ్రైవ్‌లను శాసనసభ్యులు అందరికీ అందజేసినట్టు చెప్పారు. నిధుల ఖర్చులో అధికారుల అలసత్వం ఉందని తెలిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్సీ నిధులు పక్క దారి పడుతున్నాయని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను సిఎం తప్పుపట్టారు. వాస్తవాలను వక్రీకరించడం సరికాదని పేర్కొన్నారు. సిఎం లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని సిఎం తేల్చి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ నిధులు పక్కదారి పట్టిన మాట వాస్తవమేనని అన్నారు. కానీ తమ ప్రభుత్వంలో అలా జరిగిందనడం అవాస్తవమని అన్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2651 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం ఈ మూడేళ్లలో 6713 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ఎస్సీ విద్యార్థులకు ఓవర్సీస్ పథకం కింద ఒక్కో విద్యార్థికీ 26 లక్షల వరకూ ఇస్తున్నామని అన్నారు. టిఎస్ ప్రైడ్ కింద దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. వంద శాతం సబ్సిడీతో ఎస్సీలకు రుణాలను ఇస్తున్నామని ప్రకటించారు. భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి సంక్షేమం ఈ రాష్ట్రంలో జరుగుతోందని చెప్పారు. ఏ విషయంలోనైనా పారదర్శకంగా ఉండాలని తాము అనుకుంటామని, కాని పారిపోవాలని అనుకోవడం లేదని అన్నారు. ఈ అంశంపై ప్రతి ఒక్కరూ మాట్లాడేందుకు వీలుగా రెండు రోజుల చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను కోరారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.