తెలంగాణ

గట్టెక్కిన తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జల విద్యుత్ ఆశలు అడియాసలయ్యాయి. జెన్కో పరిధిలోని రెండు యూనిట్లలో యంత్రాలు మొరాయంచాయ. విభజన చట్టంలో నిర్దేశించినట్టు విద్యుత్ వాటా ఇవ్వలేమని ఆంధ్ర తెగేసి చెప్పింది. సీలేరు విద్యుత్‌లోనూ మొండి చెయ్యి చూపింది. ఉమ్మడిలోని పిపిఏలు చెల్లవని తేల్చేసింది. కృష్ణపట్నం వాటా రాలేదు. ఇన్ని కష్టాల్లోనూ రాష్ట్రంలో క్షణకాలం కరెంట్ కట్ కాలేదు. కారణం ముందుచూపు విద్యుత్ కొనుగోళ్లే.

హైదరాబాద్, ఏప్రిల్ 24: చీకటి రోజులపై వెలుగు యుద్ధం ప్రకటించిన తెలంగాణ ఎట్టకేలక విజయం సాధించింది. పగటి ఉష్ణోగ్రతలు వివిధ చోట్ల 44 నుంచి 48 వరకు నమోదవుతున్నా లిప్తకాలం విద్యుత్ కోత లేకపోవడానికి కారణం ముందుచూపే. అలంపూర్ నుంచి భద్రాచలం వరకు బాసర నుంచి జహీరాబాద్ వరకు రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా అవుతోంది. పరిశ్రమల్లో యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఇళ్లలో ఉక్కపోతల గగ్గోలు లేదు. వీటన్నింటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం మొండి ధైర్యంతో విద్యుత్ కొనుగోలు చేయడమే. నిరుడు జల విద్యుత్‌పై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. జెన్కో పరిధిలోని రెండు యూనిట్లలో యంత్రాలు ఆశించిన సామర్ధ్యం మేరకు ఉత్పత్తి చేసే స్థితిలో లేవు. ఏపీ పునర్వ్యవస్ధీకరణ చట్టంలో నిర్దేశించినట్లుగా విద్యుత్ వాటా ఇవ్వడానికి ఆంధ్ర నిరాకరించింది. సీలేరు విద్యుత్ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించింది. ఉమ్మడి రాష్ట్రంలోని పిపిఏలు చెల్లవని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కృష్ణపట్నం 1600 మెగావాట్లలో వాటా ఇచ్చేది లేదంది. కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ విద్యుత్ కరవు నుంచి గట్టెక్కి రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోకుండా ఉండేందుకు, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 7 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ కొనుగోలు తప్పదని సిఎం కె చంద్రశేఖరరావు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయ. 2015-2016లో మొత్తం 49523.495 ఎంయు విద్యుత్ కావాలని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే 49252 ఎంయు విద్యుత్‌ను గత ఏడాది ఏప్రిల్ 1నుంచి ఈ ఏడాది మార్చి 31వరకు సరఫరా చేశారు.
జల విద్యుత్ 3421 ఎంయు ఉత్పత్తి అవుతుందని ఆశించారు. కాని అనావృష్టి పరిస్ధితులు చుట్టముట్టడంతో రాష్ట్రంలోని హైడల్ ప్రాజెక్టులు పడకేశాయి. కేవలం 290 ఎంయు జల విద్యుత్ లభ్యమైంది. దీనికి తోడు తెలంగాణ జెన్కో పరిధిలో కొత్తగూడెం, రామగుండంలో ఒక యూనిట్‌లో యంత్రాలు మరమ్మత్తులకు తరచుగా నోచుకోవడం వల్ల విద్యుదుత్పత్తి తగ్గుతుందని పసిగట్టారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం లిప్తకాలం విద్యుత్ పోకుండా ఉండాలంటే కొనుగోలు తప్పదని భావించింది. గత ఏడాది దాదాపు 2700 మెగావాట్ల మేరకు విద్యుత్ కొనుగోలు చేశారు. దీనివల్ల రూ. 600 కోట్ల భారం పడినట్టు అంచనా. జెన్కో విద్యుదుత్పత్తి 15500 ఎంయుకు పరిమితమైంది. జల విద్యుత్ లభ్యత లేకపోవడం, జెన్కో విద్యుదుత్పత్తి చాలకపోవడంతో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాలను ఖరారు చేశారు. మెసర్స్ థర్మల్ పవర్ టెక్ కార్పోరేషన్ ఇండియా నుంచి 2015-16లో 1024.56 ఎంయు కొన్నారు. ఈ ఏడాది 2006.32 ఎంయు విద్యుత్ కొనుగోలు చేయనున్నారు. ఈ సంస్థతో ఎనిమిదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉమ్మడిలో ఉన్నప్పుడు చేసుకున్న ఒప్పందంలో భాగంగా కెఎస్‌కె మహానది పవర్ నుంచి ఈ ఏడాది జూన్ 16 వరకు 215.56 మెగావాట్ల విద్యుత్ లభించనుంది. ఎన్టీపిసికి చెందిన జజ్జర్ ప్లాంట్ నుంచి గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 222 మెగావాట్ల విద్యుత్ వచ్చింది. మరో ఒప్పందం చేసుకుని గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 372 మెగావాట్ల విద్యుత్‌ను పొందుతున్నారు. అప్పటికప్పుడు తలెత్తే విద్యుత్ లోటును పూడ్చుకునేందుకు ద్వైపాక్షిక, అంతరాష్ట్ర విద్యుత్ కొనుగోలు చేపట్టారు. దీని ప్రకారం నిరుడు జూన్ నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు నెలకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేలా జెన్కో ప్రణాళిక ఖరారు చేసింది.
రాష్ట్రంలో విద్యుత్ లభ్యత ఉంటే కొనుగోళ్లు చేయాల్సిన పరిస్ధితి ఉండేదికాదు. రాష్ట్రంలో 20 లక్షల వ్యవసాయ గొట్టపుబావులున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటిమీద ఆధారపడి 30 లక్షల మంది జీవిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్లపై తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ఆంధ్రభూమితో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన 2014లో హైదరాబాద్‌తో రోజుకు నాలుగు గంటల విద్యుత్ కోతలుండేవి. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు ఉండేవి. వ్యవసాయ రంగానికి విద్యుత్ అంతంతమాత్రమే సరఫరా అయ్యేది. ఇప్పుడా పరిస్ధితి ఉందా? అన్నారు. మరో రెండేళ్లలో కొత్తగా జెన్కో ప్రాజెక్టులు రాబోతున్నాయి. అప్పుడు విద్యుత్ కొనుగోళ్ల శాతం గణనీయంగా తగ్గుముఖం పడుతుందన్నారు. నిరుడు ఏప్రిల్ 3న గరిష్టంగా తెలంగాణలో 156 ఎంయు విద్యుత్ డిమాండ్ వచ్చినా కోతలు లేకపోవడానికి ముందుచూపుతో విద్యుత్ సేకరణ చేయడమే కారణమన్నారు. టిఫ్యాప్సీ అధ్యక్షులు వెన్నం అనిల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కోతలు లేవని, రేటు ఎక్కువైనా విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయడం ముఖ్యమన్నారు. నిరుడు, ఈ ఏడాది విద్యుత్ కోతలు లేవన్నారు.
ఈ ఏడాది ఆశాజనకమే
ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడి జల విద్యుత్ ఉత్పత్తి అయితే విద్యుత్ కొనుగోళ్ల వాటా తగ్గుతుంది. ముందు చూపుతో 1720 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు జెన్కో విద్యుత్ ఒప్పందం ఖరారు చేసింది. మొత్తం 56,332 ఎంయు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, 54,884 విద్యుత్ అవసరాలకు సరిపోతుందని జెన్కో టిఎస్‌ఇఆర్‌సికి నివేదిక ఇచ్చింది. దాదాపు 1448 ఎంయు విద్యుత్ మిగులుతుంది. హైడల్ విద్యుత్ అందుబాటులోకి వస్తే 1448 ఎంయును విక్రయించి రూ.724 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. భూపాలపల్లి 600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. సింగరేణి 600 మెగావాట్ల మొదటి యూనిట్ వచ్చే జూన్ నుంచి, రెండవ యూనిట్ 600 మెగావాట్లు జూలై నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నాయి.