తెలంగాణ

ట్రాన్స్‌పోర్టు కార్మికుల చలో అసెంబ్లీని అడ్డుకున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: పెట్రోల్, డీజిల్‌ను జిఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రవాణ వర్కర్ల ఫెడరేషన్ నిర్వహించిన చలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకున్నారు. హిమయత్ నగర్ ఎఐటియుసి కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీని పోలీసులు అడ్డుకుని కార్మికులను అరెస్టు చేశారు. ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్, రాష్ట్ర కార్యదర్శి విఎస్ బోస్, తెలంగాణ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బాబు, ప్రధాన కార్యదర్శి వెంకటేశం తదితరులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రత్నాకరరావు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 57 శాతం పన్నులు వసూలు చేస్తున్నాయని, దీని వల్ల ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జిఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే వీటి ధరలు రెండు వంతులు తగ్గుతాయని అన్నారు. ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. టిఎస్‌ఆర్‌టిసి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ మంత్రులూ, ప్రజాప్రతినిధులు ప్రజల జీవితాలు ఎలాగున్నా వారి జీతభత్యాలు లక్షల్లో పెంచుకుని భోగాలు అనుభవిస్తున్నారని అన్నారు. డీజిల్ ధరలు రోజు రోజుకీ పెరగడంతో ఆర్టీసి రోజు రోజుకీ నష్టాల్లో కూరుకుపోతోందని తెలిపారు. ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో అధికంగా ధరలను పెంచి ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.