తెలంగాణ

16 రోజులకే తోక ముడిచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 17: ప్రజా సమస్యలన్నింటిపై సమగ్రంగా చర్చించేందుకు 50 రోజులు నిర్వహించుకుందామని చెప్పి, 16 రోజులకే తోక ముడిచారని టిపిసిసి ఛీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ప్రభుత్వ ప్రచార వేదికగా వాడుకున్నారని ఎద్దేవా చేశారు. 17న బీ ఏసీ సమావేశం నిర్వహించిన అనంతరం సభ నిర్వహనపై నిర్ణయిం తీసుకుందామని చెప్పి, బీఏసీ సమావేశం నిర్వహించకుండానే వాయిదా వేసుకొని వెళ్లిపోయారని మండిపడ్డారు. రుణమాఫీ సక్రమంగా కాక పోవడంతో రాష్టవ్య్రాప్తంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం మాత్రం రుణమాఫీ పూర్తి చేశామని డబ్బా కొట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నాలుగు విడతలుగా రుణమాఫీ చేయడంతో రైతులకు ఎలాంటి లబ్ది చేకూరలేదని, రుణాలపై వడ్డ్భీరం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు. ఈ అంశాన్ని గత సమావేశాల్లో లేవనెత్తగా ప్రభుత్వమే వడ్డీ భారం భరిస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మరిచారని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాల వల్ల రైతాంగం పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టబడ్డారని అన్నారు. బ్యాంకులు రైతులకు లీగల్ నోటీసులు పంపించినా ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారకమన్నారు. రైతులు అందించిన ధరఖాస్తులను స్పీకర్‌కు అందజేయనున్నట్టు చెప్పారు.
ప్రభుత్వ చిత్తశుద్ధ్ది తేటతెల్లం అయింది: కిషన్‌రెడ్డి
ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఏ పాటి చిత్తశుద్ది ఉందో సభ వాయిదాను బట్టి తేటతెల్లం అయిందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. 50రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం 16 రోజులకే వాయిదా వేసుకొని వెళ్లిపోయిందని విమర్శించారు. మూడు వారాలు జరిగిన సమావేశాల్లో ఏ ఒక్క ప్రజా సమస్యపై సమగ్రంగా చర్చ జరగలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల్లో జరుగుతున్న తీవ్ర అవినీతి, దళితులపై దాడులు, విద్యా, నిరుద్యోగ రంగాలపై పూర్తిస్థాయి చర్చ జరగాలని బీజేపీ ఎంతో ప్రయత్నించినా ప్రభుత్వం చర్చ జరగనివ్వలేదని అన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ మార్క్ డెమొక్రసీ: పొంగులేటి
రాష్ట్రంలో కేసీఆర్ మార్క్ డెమొక్రసీ నడుస్తుందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలను తమ సొంత డబ్బా కొట్టుకునేందుకు ప్రభుత్వం వాడుకుందన్నారు. 17న బీ ఏసీ సమావేశాన్ని నిర్వహించకుండానే సభను వాయిదా వేశారని అన్నారు.
ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాస్వామ్య పద్దతిలో తెలియజేందుకు ప్రయత్నించే అవకాశం లేకుండా చేశారని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత నిర్భందాల మద్య సభ జరిగింది ఇక్కడేనని అన్నారు.

చిత్రం..శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయంట్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న పిసిసి నేత ఉత్తమ్