తెలంగాణ

పోలీసు శిక్షణలో కొత్త సిలబస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణ పోలీసు అకాడమి దేశంలో తొలిసారిగా పోలీసు శిక్షణ సిలబస్‌లో బాలలపై లైంగిక దాడులు, వాటిని అరికట్టడంపై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అంశాలను చేర్చింది. అలాగే రకరకాల నేరాలు పెరుగుతున్ననేపథ్యంలో దర్యాప్తులో కొత్త మెళకువలను ఎంపికైన పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సైలకు శిక్షణలో నేర్పించనున్నారు. దీనికి సంబంధించి పోలీసు అకాడమి అన్ని సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రప్రభుత్వం రిక్రూట్‌మెంట్‌లో స్టయిఫండరీ కేడెట్ ట్రైనీ సబ్ ఇనెస్పెక్టర్స్, ట్రైనీ ఎస్సైలకు 20వ తేదీ నుంచి 12 నెలల పాటు శిక్షణ మొదలవుతుంది. రాష్ట్ర పోలీసు అకాడమిలో ఎస్సైలకు శిక్షణ ప్రారంభమవుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వీటిని ఎదుర్కొనే అంశంపై కూడా ఎస్సైలకు శిక్షణ ఇవ్వనున్నారు. బాలలపై లైంగిక దాడులు ఇటీవల కాలంలో పెచ్చుమీరుతున్నయి. వీటిని సున్నితంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. బాధితుల సంరక్షణ, సాక్ష్యాల సేకరణ, కీలకమైన సమాచారాన్ని రాబట్టడం తదితర అంశాలను ట్రైనీ ఎస్సైలకు బోధిస్తారు.