తెలంగాణ

సీఎం క్యాంపు ఆఫీసు ఎదుట గిరిజన జేఏసీ మెరుపు ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తున్నదని ఆరోపిస్తూ తెలంగాణ గిరిజన సంఘాల రాజకీయ జెఎసి నాయకులు, కార్యకర్తలు శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. అయితే 24 గంటలూ భద్రత ఉండే క్యాంపు కార్యాలయం ఎదుట మెరుపు ధర్నాకు యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసులు వచ్చిన వారిని వెంట వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కాగా అదే సమయంలో సీఎం ప్రగతి భవన్‌లో గిరిజన ఎమ్మెల్యేలతో సమావేశమై గిరిజనుల సంక్షేమం కోసం చర్చిస్తున్నారు. గిరిజన ఐక్య వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ వివేక్ వినాయక్, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ధర్మా నాయక్, లంబాడ హక్కుల అధ్యక్షుడు గణేశ్ నాయక్ అధ్వర్యంలో మెరుపు ధర్నాకు దిగారు.