తెలంగాణ

ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, నవంబర్ 18: ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి వచ్చిన లారీ వేగంగా ఢీ కొట్టడంతో దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనరు దుర్మరణం పాలయ్యారు. మిషన్ భగీరధ పధకం పనులకు సంబంధించిన పైపుల లోడ్‌తో గౌడవెల్లి ప్రాంతం నుండి బయలుదేరిన లారీ ఎపి 28ఎక్స్ 3774 నంబరు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఓఆర్‌ఆర్ వద్దకు చేరుకుంది. సుల్తాన్‌పూర్ గ్రామ పరిధిలోని గండిగూడ వద్ద లారీ చేరుకున్న తరువాత దాని డ్రైవరు సుబ్బారావు(52) రోడ్డు పక్కన లారీని ఆపి లఘశంకకకు వెళ్లాడు. అనంతరం లారీ వెనుక టైర్లు చెక్ చేస్తుండగా వేగంగా వచ్చిన టిఎన్ 30 బిఇ 3899 నంబరు గల మరో లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. తమిళనాడు రాష్ట్రం నుండి ఉత్తరప్రదేశ్‌కు మినపలోడ్‌తో వెళుతున్న ఈ లారీ ఇనుప పైప్‌ల లోడుతో ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఆగి ఉన్న లారీ డ్రైవరు సుబ్బారావుతో పాటు ప్రమాదానికి కారణకుడైన లారీ డ్రైవరు మణికందన్(35), క్లీనరు కృష్ణమూర్తి(45) ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన లారీ ముందు భాగం పూర్తిగా నజునుజ్జుగా మారింది. నిద్ర నుండి డ్రైవరు సరిగా కోలుకోకపోవడమే ఉదయం ఎనిమిది గంటలకు జరిగిన ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని అమీన్‌పూర్ సిఐ రామిరెడ్డి సందర్శించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.