రాష్ట్రీయం

మతమార్పిడులు మంచిది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: భారతదేశంలోని గిరిజన ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో హిందూమతం నుండి క్రిస్టియన్ మతంలోకి మతమార్పిడిలు యథేచ్చగా జరుగుతున్నాయని, ఈ విధానం మంచిది కాదని విశాఖ శ్రీశారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పేర్కొన్నారు. హిందూసమాజంలో పేదరికాన్ని కొన్ని క్రైస్తవ సంస్థలు మతమార్పిడిలకోసం వినియోగించుకుంటున్నాయని గుర్తు చేశారు. రుషీకేశ్ (ఉత్తరాఖండ్) లోని పరమార్థనికేతన్ ఆశ్రమంలో శనివారం జరిగిన విరాట్ హిందూస్థాన్ సంఘం నాలుగో వార్షికోత్సవంలో మాట్లాడుతూ, మతమార్పిడిలు జరగడాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఇప్పటికీ గోవధ జరగడం శోచనీయమని అభిప్రాయపడ్డారు. గోవధ నిషేధం కోసం అందరూ ప్రయత్నించాలని సూచించారు. హిందూ సమాజాన్ని పరిరక్షించుకునేందుకు యువతీ యువకులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విరాట్ హిందూస్థాన్ అధ్యక్షుడు, బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రముఖులు పాల్గొన్నారు.

చిత్రం..రుషికేష్‌లో విరాట్ హిందూస్థాన్ సంఘం నాలుగో వార్షికోత్సవంలో మాట్లాడుతున్న స్వరూపానందేంద్ర