తెలంగాణ

కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 18: తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కితేనే బంగారు తెలంగాణ సాధ్యమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, చేనేత శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. 50సంవత్సరాలకు పైగా దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కారణంగానే తెలంగాణకు దరిద్రం పట్టుకుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత ఇప్పుడైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామనుకుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. వరంగల్ పర్యటన సందర్భంగా శనివారం హన్మకొండ కెడిసి గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని, ఉద్యోగ నియామకాలకు పూనుకుంటే కోర్టులకు వెడుతున్నారని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనుకుంటే కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసారని, ఇప్పుడు బంగారు తెలంగాణ ఆవిర్భావానికి అడ్డుపుల్లలు వేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తమ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు ద్వారా తెలంగాణకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోందని అన్నారు. ఏనుగు పోతుంటే కుక్కలు మొరిగినట్లు కొందరు ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఏదేదో మాట్లాడుతున్నారని, వీరి ఆరోపణలను, వీరి విమర్శలను తాము పట్టించుకోమని తెలిపారు. ప్రజలకే తాము జవాబుదారులమని, ప్రజలే తమకు బాస్‌లని చెప్పారు. గత మూడున్నర సంవత్సరాలుగా తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా అన్నివర్గాలకు చెందిన లక్షలాది కుటుంబాలు ప్రయోజనం పొందాయని తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల ద్వారా రాష్టవ్య్రాప్తంగా 40లక్షల మందికి లాభపడుతున్నారని, దేశంలో మొదటిసారిగా ఏ దిక్కూలేని ఆడపడచులకు పెన్షన్లు ఇవ్వటం తెలంగాణ ప్రభుత్వంలోనే కొనసాగుతోందని అన్నారు. ఆడపిల్లలంటే భారం అనుకునే ప్రస్తుత పరిస్థితుల్లో అండగా తాను ఉన్నానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలు ఆడవారిలో మనోధైర్యాన్ని నింపుతున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మాతాశిశు మరణాల సంఖ్య 34శాతం ఉంటే తెలంగాణ ఏర్పడితన తరువాత తల్లీపిల్లల రక్షణకు అమలు చేస్తున్న పథకాలతో మాతాశిశు మరణాల సంఖ్య భారీగా తగ్గిందని, దేశంలోనే మాతాశిశుమరణాలు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండవ స్థానంలో నిలచిందని తెలిపారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు ద్వారా పేదపిల్లలకు ఉచిత విద్యను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని అన్నారు.
హైదరాబాద్ తరువాత వరంగల్ జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, విద్య, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి సాధిస్తోందంటూ, ఇక్కడ ఏర్పాటుచేసే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామని, దీనికోసం యువతకు ఆయా రంగాలలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని మం్ర కేటీఆర్ తెలిపారు. ఐటి, పరిశ్రమల రంగాలు వరంగల్‌లో భారీగా విస్తరించే అవకాశాలు ఉన్న కారణంగా మామునూరు విమానాశ్రయాన్ని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రాష్ట్రప్రభుత్వ నిధులు కేటాయిస్తామని చెప్పారు.
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతు కాంగ్రెస్ హయాంలో రోజుకు ఆరుగంటలు విద్యుత్ సరఫరా గగనంగా ఉండేదని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న చర్యల కారణంగా గృహ, పారిశ్రామిక అవసరాలకు రోజుకు 24గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని చెప్పారు. ప్రజల అభిమానం, ఉనికిని కోల్పోయిన కొందరు నాయకులు ముఖ్యమంత్రిపై, తమ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపి దయాకర్, ప్రభుత్వ సలహాదారు వివేక్, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..శనివారం హన్మకొండలో నిర్వహించిన బహిరంసభలో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్