తెలంగాణ

పల్లెలకూ రహదారి సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, నవంబర్ 18: పల్లెల మధ్య నాణ్యమైన రహదారుల నిర్మాణాన్ని చేపట్టి పట్టణాలకు దీటుగా పల్లెలకు కూడా మెరుగైన రహదారి సౌక ర్యం కల్పించాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. శనివారం నార్కట్‌పల్లి మండల కేంద్రం నుండి అమ్మనబోలు వరకు నిర్మించనున్న రహదారి పనులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకంట్ల జగదీష్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యాల వల్ల రాష్ట్రంలో ఎక్కడ కూడా గ్రామాల మధ్య నాణ్యమైన రోడ్లు లేక ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారన్నారు. నాటి ఉద్యమకారుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాదయాత్ర అనుభవాలను నెమరువేసుకుంటూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రోడ్ల నిర్మాణాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లు తెలిపారు.
వెనుకబడ్డ నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, యాదగిరిగుట్ట, మహబూబ్‌నగర్‌లాంటి అనేక జిల్లాల్లో ప్రతీ పల్లెకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేగవంతంగా పనులు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటికే తమ శాఖ పనితీరును వేగవంతం చేస్తూ నాణ్యమైన రోడ్లను నిర్మించాలని ఆదేశించానని తెలిపారు. తమ ప్రభుత్వ హయాం లో నిర్మించే రహదారుల్లో ఎలాంటి అవినీతి లేకుం డా నాణ్యమైన రోడ్లు నిర్మిస్తున్నామని, పదేళ్ల కాలం లో గుంతలు కూడా పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కూడా తాను మంత్రిగా పని చేశానని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి గత ప్రభుత్వాలకు భిన్నంగా నిత్యం పట్టుదలతో పని చేస్తూ సహచర మంత్రులను అభివృద్ధి పనులపై పరుగులు తీయిస్తున్నారని, ఇలాంటి అభివృద్ధి ప్రభుత్వంలో తాను పని చేస్తుండటం ఆనందంగా ఉన్నట్లు వెల్లడించారు. గత ఆంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ వెనుకబాటుతనానికి గురైందని, 30 ఏళ్లుగా పరిపాలించిన ప్రభుత్వాలు ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అందించలేకపోయాయని, కేవలం మూడేళ్లలో అసాధ్యమనుకున్న విద్యుత్‌లాంటి సమస్యలను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని, సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి ప్రజల సంపూర్ణ సహకారం అవసరమన్నారు.
రాష్ట్రంలో 60వేల కిలోమీటర్ల పొడవున గ్రామాలను మండలాలతో, మండలాలు జిల్లాలతో అనుసంధానం చేసే రోడ్లను నిర్మించేందుకు కృషి చేస్తున్నట్టు ఆయ న వివరించారు. అత్యున్నత ప్రమాణాలతో రోడ్లను నిర్మిస్తున్నామని, మరమ్మతులకు రోడ్లు గురికాకుండా పకడ్బందీగా నాణ్యమైన రోడ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ టీఆర్‌యస్ ప్రభుత్వంలో జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, నల్లగొండ టీఆర్‌యస్ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్యయాదవ్, ఎంపీటీసీ యాదయ్య, ముత్యాలు, వైస్ ఎంపీపీ పద్మ ముత్తయ్య, సర్పంచ్ గౌడ్, భూపాల్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ రహీంఖాన్, సత్తయ్య, నాయకులు ముంతా వెంకన్న, నాంపల్లి శ్రీను, అహ్మద్ పటేల్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..రోడ్డు పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీష్‌రెడ్డి