తెలంగాణ

అన్ని వర్గాలకూ దగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, నవంబర్ 18 : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలను గత మూడున్నర సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం దగా చేసిందని స్థానిక ఎంయల్‌ఏ, టిపిసిసి చీఫ్ కెప్టెన్ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక కాంగ్రెసు కార్యాలయం ఇందిరా భవన్‌లో జరిగిన నియోజకవర్గ కాంగ్రెసు పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ అని చెప్పి నాలుగు వాయిదాలలో చేశామని అన్నా రైతులపై బ్యాంకులలో వడ్డీ భారం ఇంకా ఉందని అన్నారు. ప్రభుత్వం, బ్యాంకుల మధ్య రైతులు గత 3 సంవత్సరాలుగా నలిగిపోయి కేసీఆర్ వారికి ఒక శాపంగా మారారని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెసు ప్రభుత్వం రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేసిందని గుర్తు చేశారు. బ్యాంకులలో వడ్డీ భారం ఉన్న రైతులు అంతా రెండు రోజుల్లో తనకు దరఖాస్తులు ఇస్తే శాసనసభ స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయని అన్ని వర్గాల వారు ఆశించి భంగపడినామని అంటున్నారని అన్నారు. రాష్ట్రంలో బంగారు తెలంగాణకు బదులు బం గారు కుటుంబం బాగుపడుతోందని మీడియా కూడా ప్రభుత్వం వారు అబద్దాలు చెప్పినా పతాకస్థాయి శీర్షికలో కాంగ్రెసు వారు నిజాలు చెప్పినా ఎక్కడో లోపల పేజీలో చిన్నగా వేస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథ పేరుతో 50 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల పాలు చేస్తున్నారని రైతులకు, విద్యార్థులకు, దళితులకు ఇవ్వటానికి మాత్రం ప్రభుత్వం వద్ద డబ్బు లేద ని అంటున్నారని అన్నారు. పట్టణంలో 4వేల ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసి 70 శాతం పూర్తి చేయగా రాజకీయ దురుద్దేశంతో గత 3 సంవత్సరాలుగా నిలిపివేశారని విమర్శించారు. 2019లో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావ టం ఖాయమని, బిసిలకు జనాభా ప్రకారం రిజర్వేషన్‌లు కల్పిస్తామని, ఒకే విడుత రైతుల 2లక్షల రుణాలు మాపీ చేస్తామని, వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నకు కేంద్రం ఇచ్చే మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లిస్తామని ఆయన ప్రకటించారు.

చిత్రం..హుజూర్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెసు పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి