తెలంగాణ

160 టిఎంసి వాడుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: గోదావరిపై తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులతో మహారాష్టక్రు ముంపులేకుండా రీ డిజైన్ చేసినట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు మహారాష్ట్ర సిఎం ఫడ్ననీస్‌కు వివరించారు. దీంతో ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు తొలగిపోయాయి. వచ్చే జనవరి నుంచి ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద నిర్మించబోయే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదివారం అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఆదివారం మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్‌తో సిఎం కెసిఆర్ ఫోన్లో మాట్లాడారు. గోదావరి నుంచి 160 టిఎంసిల నీటిని వాడుకునేందుకు మహారాష్ట్ర సిఎం ఫడ్ననీస్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సిఎం వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, నీటిపారుదల ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి, ఈఎస్‌సి మురళీధర్‌రావు, వ్యాప్కోస్ ఎండి శంభుఆజాద్ తదితరులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర సిఎంతో మాట్లాడిన అనంతరం ఆ రాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావుతోనూ కెసిఆర్ చర్చించారు. రాష్ట్రంలో నిర్మించబోయే ప్రాజెక్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభించేలా చూడాలని గవర్నర్‌కు సిఎం విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర నీటిపారుదల మంత్రి, ఆ రాష్ట్ర అధికారులతో చర్చించేందుకు తెలంగాణనుంచి మంత్రి హరీశ్‌రావుసహా అధికారుల బృందాన్ని మహారాష్టక్రు పంపించనున్నట్టు కూడా ఫోన్లో సిఎం కెసిఆర్ తెలిపారు. తాము కూడా ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు అధికారులను సిద్ధం చేయనున్నట్టు మహారాష్ట్ర సిఎం హామీ ఇచ్చారు. ఇలాఉండగా త్వరలో తుమ్మిడిహట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి నివేదికలతో మహారాష్ట్ర వెళ్లాల్సిందిగా మంత్రి హరీశ్‌రావుతోపాటు అధికారులను సిఎం ఆదేశించారు. తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి తలపెట్టిన ప్రాజెక్టుల రీ డిజైన్ ఒక కొలక్కిరావడంతో ఇక కార్యరంగంలోకి దిగాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. గోదావరిపై నిర్మించబోయే ప్రాజెక్టుల పనులు జనవరిలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని, ప్రాజెక్టుల ద్వారా బీడు భూములకు సాగునీరు అందుతుందనే ఆశాభావంతో ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తుమ్మిడిహట్టి, కాళేళ్వరం ప్రాజెక్టుల పనులు ఏకకాలంలో ప్రారంభమై, పనులు వేగవంతం చేయాలని సిఎం సూచించారు. నెలాఖరులోగా ప్రాజెక్టులకు సంబంధించిన బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాల్వలు, పైపులైన్లకు సంబంధించిన నివేధికలు పూర్తికావాలని సిఎం ఆదేశించారు. కనిష్ట ముంపు, గరిష్ట నీటి వినియోగం అనే పద్ధతిలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని, దీనివల్ల అంతరాష్ట్ర వివాదాలు, భూసేకరణ సమస్యలు ఎక్కువగా ఉండవని సిఎం సూచించారు. తుమ్మిడిశెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించాలని, ఆదిలాబాద్ జిల్లాకు నీరందేలా రెండు మూడుచోట్ల రిజర్వాయర్లు నిర్మించాలని సూచించారు. కాళేశ్వరం బ్యారేజీని కూడా వీలైనంత తక్కువ ముంపు ఉండేలా రీ డిజైన్ చేసిన వ్యాప్కోస్‌ను సిఎం అభినందించారు. దీనికి సంబంధించిన తుది ముసాయిదాను వెంటనే అందించాల్సిందిగా సిఎం కోరారు. వచ్చే ఏడాది వర్షాలు ప్రారంభమయ్యేసరికి చాలామటుకు పనులు పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు.

చిత్రం.. సాగునీటి ప్రాజెక్టుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు