తెలంగాణ

పాలనలో లోపాలుంటే కోర్టుకెళ్లక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో లోపాలు ఉంటే కోర్టుకు వెళ్ళక తప్పదని టి.జెఎసి చైర్మన్ ఎం. కోదండరామ్ తెలిపారు. ఆదివారం అడ్వకేట్ జెఎసి అధ్వర్యంలో జరిగిన సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అమోఘమని అన్నారు. అయితే న్యాయవాదులు కొంత మంది వివిధ అంశాలపై కోర్టుకు వెళుతున్నారని ప్రభుత్వంలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారని ఆయన చెబుతూ ప్రభుత్వ పాలన తీరును బట్టి కోర్టుకు వెళ్ళక తప్పదని చెప్పారు. న్యాయపరమైన అంశాలపై న్యాయవాదులకు ఉన్న అవగాహన ఇతరులకు ఉండదన్నారు. ప్రతి ప్రజా సమస్యపై సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అన్ని శాఖల్లో ఒక జెఎసి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. నేరెళ్ళ ఘటనపై తాము అక్కడికి వెళ్ళినప్పుడు న్యాయవాదులు లేని లోటు కనిపించిందని ఆయన తెలిపారు. న్యాయవాదులు జెఎసిని ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రొఫెసర్ కోదండరామ్ అభినందించారు. ఇలాఉండగా 41 సిఆర్‌పిసిని రద్దు చేయాలని, తెలంగాణలో హైకోర్టును ఏర్పాటు చేయాలని, న్యాయ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అడ్వకేట్ జెఎసి తీర్మానాలు ఆమోదించింది.
అడ్వకేట్ జెఎసి నూతన కమిటీకి జరిగిన ఎన్నికల్లో కన్వీనర్లుగా గోపాల్ శర్మ, కొండా రెడ్డి, మల్లేష్ ఎన్నికయ్యారు. ఇంకా కో-కన్వీనర్లుగా మహ్మద్ మహమూద్, హస్మ రహీమ, బాబురావు, అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్, ప్రసాద్ బాబు, ఉదయగిరి, వెంకటేష్ యాదవ్, లక్ష్మణ్, చిల్ల రాజేంద్ర ప్రసాద్, బొట్ల పవన్, నాగుల చెన్నారెడ్డి, రామగిరి ప్రభాకర్, ఆండాలు, డొంకన రవి, రాజశేఖర్ గౌడ్, భాగ్య ఎన్నికయ్యారు.

చిత్రం..ఆదివారం హైదరాబాద్‌లో అడ్వకేట్స్ జేఏసీ నిర్వహించిన సమావేశంలో
ప్రసంగిస్తున్న జేఏసీ చైర్మన్ కోదండరామ్