తెలంగాణ

పాల ఉత్పత్తిదారులకు లీటర్‌కు రూ.4 చొప్పున నగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: పాల ఉత్పత్తిదారులకు లీటరు పాలపై ప్రభుత్వం అదనంగా ఇవ్వనున్న రూ. 4 నగదు ప్రోత్సహకం చెల్లింపునకు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరిస్తూ మంగళవారం పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాల ఉత్పత్తిదారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయనుంది. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలలో సభ్యులుగా చేరిన రైతులకు మాత్రమే ఈ డబ్బును చెల్లించనున్నారు. ప్రభుత్వ అందించనున్న నగదు ప్రోత్సహకాన్ని పొందడానికి ఎంపిక చేసిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల పేర్లను ఉత్తర్వులలో పేర్కొన్నారు. వీటిలో ది తెలంగాణ స్టేట్ డైయిరీ డవలప్‌మెంట్ కో-అపరేటీవ్ సమాఖ్య రంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి-కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్, ములకనూర్ మహిళా మ్యుచ్‌వల్ ఎడెడ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కో-అపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ ఉన్నాయి. ప్రభుత్వ నగదు ప్రోత్సహకానికి అర్హులైన రైతుల జాబితాను ప్రతీ నెలా పాడిపరిశ్రమాభివృద్థి సంచాలకునికి అందజేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్రా జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.