తెలంగాణ

అంకితభావంతో సేవలందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: పోలీస్ శిక్షణ అనంతరం అంకితభావం, త్యాగనిరతితో పనిచేయాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆర్‌బివిఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇటీవల ఎంపికైన 2017వ బ్యాచ్‌కు చెందిన డిఎస్పీ, ఎస్‌సిటి ఎస్‌ఐ అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పోలీస్ అకాడమీలో డిఎస్పీ1, ఎస్‌సిటీ ఎస్‌ఐలు (సివిల్-196, ఎస్‌సిటీ కమ్యూనికేషన్-22, ఎస్‌సిటీ ఎస్‌ఐ-పిటివో-6, మొత్తం 225 మంది అభ్యర్థులు శిక్షణ పొందనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ ప్రొబేషనరీ సిబ్బందినుద్దేశించి ప్రసంగిస్తూ ఆలోచనాత్మకతతో కూడిన శిక్షణ పొందాలని, ప్రజల్లో మమేకమై సమాజానికి సేవలందించాలని సూచించారు. రౌండ్ ద క్లాక్ సేవకు సిద్ధంగా ఉండాలని, శిక్షణలో ఆధునిక టెక్నాలజీ వినియోగం, సైబర్ నేరాల అదుపు, ఫోరెన్సిక్ ల్యాబ్, పరీక్షలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, అలాంటి సాంకేతికతపై పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడతాయన్నారు. సమాజం ఏమిచ్చిందని కాదు.. సమాజానికి మనం ఏం చేయగలం అనేది ముఖ్యం కావాలని, పోలీసులు అంటే ప్రజకు భయం లేకుండా చూడాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజల్లో మమేకం కావాలని సూచించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్ మాట్లాడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వహించేలా శిక్షణ ఉంటుందని, ఈ శిక్షణలో కొత్తకొత్త సబ్జెక్టులు, పరిశోధనలపై కూడా ప్రొబేషనరీలు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ విధివిధానాలు, క్రమశిక్షణ, కోర్సు సిలబస్, ఎనాలైసిస్ ప్రొఫైల్స్‌ను అవగాహన కల్పించారు.

చిత్రం..ఎస్సైల శిక్షణను ప్రారంభించి, ప్రసంగిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి, పాల్గొన్న ప్రొబేషనరీ డిఎస్పీ, సబ్ ఇనె్స్పక్టర్లు