తెలంగాణ

తెలుగు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: వచ్చే విద్యాసంవత్సరం నుండి తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మొదటి సంవత్సరం నుండి ఇంటర్ వరకూ అమలు చేయడం కోసం కావల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో విద్యార్ధులకు ఇబ్బంది కలుగని రీతిలో తెలుగు భాషను స్కోరింగ్ సబ్జెక్టుగా కూడా అభివృద్ధి చేయాలని అన్నారు. మంగళవారం నాడు ఆయన విద్యాశాఖ అధికారులతో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. తమిళనాడు , పంజాబ్ రాష్ట్రాల్లో మాతృభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలుచేస్తున్న తీరును , సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈల్లో కూడా తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై ఎలాంటి చర్యలు చేపట్టవచ్చో కూడా డిప్యుటీ సీఎం సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై ఈ సబ్ కమిటీ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి వివరించింది. తెలంగాణలో తెలుగు భాష మాతృభాషగా లేని పాఠశాలలు 1370 వరకూ ఉన్నాయని, మొదటితరగతి నుండి ఇంటర్ వరకూ వచ్చే విద్యాసంవత్సరం నుండి తెలుగును తప్పనిసరి సబ్జెక్టు చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఐదో తరగతి వరకూ తెలుగు భాషను చదువుకోని వారికి ఆరోతరగతిలో అత్యంత సులభమైన పద్ధతిలో సబ్జెక్టును నేర్చుకునే విధంగా పాఠ్యపుస్తకాలను రూపొందిస్తామని అన్నారు.
అదే విధంగా ఏడో తరగతి వరకూ తెలుగు చదువుకోని వారికి ఏనిమిదో తరగతిలో, పదో తరగతి వరకూ చదువుకోని వారికి ఇంటర్ ఫస్టియర్‌లో తెలుగు భాషను సులభంగా నేర్చుకునేందుకు ప్రత్యేక పుస్తకాలు రూపొందిస్తున్నామని అన్నారు. తెలుగు భాష అమలు గురించి సీబీఎస్‌ఈ అధికారులతో, ఐసీఎస్‌ఈ అధికారులతో కూడా మాట్లాడామని, వారు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు చెప్పారని ఉప ముఖ్యమంత్రికి సబ్ కమిటీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న సబ్ కమిటీని రానున్న రోజుల్లో తెలుగు భాష అమలు సంఘంగా మార్చుతున్నట్టు ఆయన వెల్లడించారు. తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంలో రాష్టస్థ్రాయిలో, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఉండాలని, వాటి నిర్మాణం ఎలా ఉండాలో కూడా కమిటీ సూచించాలని అన్నారు. తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టుగా మార్చడంలో అది విద్యార్థులకు ఆసక్తికరంగా అభివృద్ధి చేయడంతో పాటు స్కోరింగ్ సబ్జెక్టుగా మార్చాలని అన్నారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, విద్యాశాఖ సంచాలకుడు కిషన్, తెలుగు భాష తప్పనిసరి అమలు సబ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, కన్వీనర్ ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, ముఖ్యమంత్రి ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్, అధికార భాషా కమిషన్ చైర్మన్ దేవులపల్లి ప్రభాకరరావు, ఎస్వీఇఆర్‌టి డైరెక్టర్ శేషుకుమారి, తెలుగు అకాడమి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు సువర్ణ వినాయక్ తదితరులు పాల్గొన్నారు.