తెలంగాణ

చెరువుల్లోకి 70 కోట్ల చేప పిల్లలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: రాష్ట్రంలోని 24,372 నీటి వనరుల్లోకి సుమారు 70 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇప్పటి వరకు 10,857 నీటి వనరులలో 48 కోట్ల 83 లక్షల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు. మంగళవారం బేగంపేటలోని హరితప్లాజాలో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో మంత్రి తలసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని ప్రసంగిస్తూ రాష్ట్రంలో మరింత మత్స్య సంపదను అభివృద్ధి చేయడం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిని సాధించగలరని అన్నారు. మత్స్య సంపద పెంచేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రిజర్వాయర్లు, చెరువులలో గత ఏడాది నుంచి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. అంతేకాకుండా 10 జలాశయాల్లో కోటి 50 లక్షల రొయ్య పిల్లలను కూడా ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా విడుదల చేయడం జరిగిందని మంత్రి తలసాని తెలిపారు. మత్స్య శాఖలో ప్రతిభ కనబరిచిన వివిధ జిల్లాలకు చెందిన పలువురు మత్స్య శాఖ అధికారులకు మంత్రి సర్ట్ఫికేట్లు అందజేశారు.