తెలంగాణ

వాయు కాలుష్యం తగ్గించేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: రాష్ట్రంలో వాయు కాలుష్యం తగ్గించేందుకు దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు పోతున్నామని మున్సిపల్‌శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. మెట్రోరైలు భవన్‌లో మంగళవారం జపాన్ ప్రతినిధి బృందంతో మున్సిపల్, పట్టణాభివృద్ధి అధికారులతో కలిసి మంత్రి సమావేశమయ్యారు. వాయు కాలుష్యం, సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ రంగాలలో జపాన్ పద్ధతులు, సాంకేతికతను వినియోగించుకుంటామని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం నూతన సాంకేతికతను అందిపుచ్చుకుకోవడంలో ముందు ఉంటుందన్నారు. వాయు కాలుష్య నివారణలో జపాన్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. ఈ అంశంలో జపాన్ అనుభవాలను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పెద్ద నగరాలలో వాయు నాణ్యతపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జపాన్ బృందాన్ని మంత్రి కెటిఆర్ కోరారు. చెత్త ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, వేస్ట్ టూ ఏనర్జీ, సాలీడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ పద్దతులు, స్పాట్ ఇన్సినరేషన్ ప్లాంట్ల ఏర్పాటు వంటి అంశాలపై జపాన్ సహకారం తీసుకుంటామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నగరంలో అతి కాలుష్య కారక పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమలలో అత్యుత్తమ కాలుష్య నియంత్రణ పద్దతులను అవలంభిస్తున్నామన్నారు. పెద్ద కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫార్మసిటీ వంటి ప్రాజెక్టుల్లో కాలుష్య నియంత్రణకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పద్ధతులను అవలంభిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. తమ అధికారుల బృందం ఇప్పటికే జపాన్‌లో పర్యటించి వాయు కాలుష్యం, సాలీడ్ వేస్ట్ మేనేజిమెంట్‌పై అధ్యయనం చేసి వచ్చిందన్నారు. తమ విజ్ఞప్తి మేరకే ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి జపాన్ బృందం రాష్ట్రానికి వచ్చిందన్నారు. జపాన్ బృందం బీబినగర్ పవర్ ప్లాంట్, జవహార్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిందన్నారు. అలాగే హైదరాబాద్, వరంగల్ నగరాలల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుందన్నారు. టోక్యో క్లీన్ ఏయిర్ అథారిటీ ఇక్కడ ఏర్పాటు చేయనున్న క్లీన్ అథారిటీకి సహాయ, సహకారాలుస అందించేందుకు సిద్ధంగా ఉందని జపాన్ బృందం హామీ ఇచ్చింది.