తెలంగాణ

సిద్దిపేటలో పురావస్తు మ్యూజియం ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 21: నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర శ్రామికుడిలా కృషి చేస్తూ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో పరు గులు పెడుతున్న సిద్దిపేట ఎమ్మెల్యే, భారీ నీటి పారుదల శాఖ మం త్రి తన్నీ రు హరీశ్‌రావు మదిలో మరో సరికొత్త ఆలోచన పుట్టుకువచ్చింది. విద్య, వైద్యం, రహదారులు, వ్యవసాయం, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, నేరాల అదుపు, పన్నుల వసూళ్లు తదితర రంగాల్లో పూర్తి స్థాయి అభివృద్ధి సాధించినట్లుగానే సిద్దిపేటకు పర్యాటకంగా కూడా గుర్తింపు తీసుకువచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో సిద్దిపేట మండలం పుల్లూరు, నంగునూర్ మండలం నర్మెట, పాలమాకుల గ్రామ శివారు ప్రాంతాలో రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు పురాతన రాకాసి గూళ్లను కనుగొని తవ్వకాలు చేపట్టారు. వేల సంవత్సరాలకు చెందిన మానవ అవశేషాలను వెలికి తీసారు. రాతి, మధ్య యుగాల నడుమ మానవుడి జీవన విధానాలకు సంబంధించిన అనేక మట్టి పాత్రలు లభించాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఏ మాత్రం అభివృద్ధి చెందని ఆ కాలంలోనే మనిషి మేధస్సు ఏ విధంగా ఉపయోగించాడనే దానికి తవ్వకాల్లో లభించిన మట్టి పాత్రలే నిదర్శనం. తవ్వకాల్లో వెలి కితీసిన మట్టి పాత్రలను, ఇతర పరికరాల ను పరిశోధనలకు పంపించిన విషయం తెలిసిందే. ఒక్కో రాకాసి గూడులో మనిషి మృతదేహాన్ని భద్రపర్చడానికి నాటి కాలంలో తీసుకున్న చర్యలు చాలా శ్రమ తో కూడుకున్నవిగా అధికారులు పేర్కొంటున్నారు. ఒక రాకాసి గూడు పై ఉంచిన 40 టన్నుల బండరాయే ఇందుకు ఉదాహరణ. కాగా, వెలికితీసిన మట్టి పాత్రల ను సిద్దిపేట ప్రజలకు అందుబాటు లో ఉంచేందుకు మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు తెలిసింది. పరిశోధనలు ముగియగానే పూర్తి వివరాలతో కూడిన మ్యూజియాన్ని సిద్దిపేటలో ఏర్పాటు చేయించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పురావస్తు శాఖ డైరెక్టర్ ఎన్‌ఆర్.విశాలాక్షితో సమాలోచనలు నిర్వహించినట్లు సమాచారం. ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళికలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన సూత్రప్రాయంగా పురావస్తు శాఖ అధికారులకు తెలిపినట్లు డైరెక్టర్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి వెల్లడించారు.
మ్యూజి యం ఏర్పాటుకయ్యే స్థలం, భవనాల నిర్మాణం, సిబ్బంది, నిధుల సమకూర్పుపై అధికారులు నివేదికలు సిద్ధం చేయనున్నారు. ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి నిధులు సమకూర్చడమే తరువాయి. సంబంధిత శాఖ అధికారులు శరవేగంగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మ్యూజియం అందుబాటులోకి వస్తే పర్యాటకంగా సిద్దిపేటకు పేరు సిద్ధించడంతో పాటు ఉపాధి లభిస్తుంది.