తెలంగాణ

అక్రమార్కులపై క్రిమినల్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, నవంబర్ 21: రైతాంగాన్ని మోసం చేస్తున్న దళారీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రభూమి దినపత్రిక మెయి న్, జిల్లా అనుబంధంలో ‘్భరికార్డుల ప్రక్షాళనలో నకిలీల గుట్టురట్టు’ ‘పేరుకే పైసా ఖర్చులేని భూ ప్రక్షాళన’ అనే అంశాలపై సమ గ్ర కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. మంగళవారం జేసీ మండలంలోని కొత్తగూడెం, గానుగుబండ, వెంపటి గ్రామాలలో జరుగుతున్న భూప్రక్షాళన సదస్సులను తనిఖీ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అన్నారం గ్రామంలో నకిలీ పుస్తకాల వ్యవహారం పట్ల జాగ్రత్తగా ఉంటూ దళారీల ను గుర్తించాలని సూచించారు. అన్నారం గ్రామంలో రెవెన్యూ అధికారి, వీఆర్‌ఏలు కలి సి ప్రతీ ఇల్లిల్ల్లూ తిరుగుతూ రైతులకు పలు సూచనలు చేస్తూ భూమి పట్టాలు చేసుకునే విధంగా చైతన్యపర్చాలని ఆదేశించారు. అం తేగాకుండా ఇప్ప టివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి పేర్లజాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డుపై అంటించాలని, దీని ద్వారా అస లు, నకిలీలు విషయం తెలుస్తుందని వివరించారు. తహశీల్దార్ వెంకన్న, డిప్యూటీ తహశీల్దార్ పుష్ప పాల్గొన్నారు.
తహశీల్దార్ ప్రత్యేక సమావేశం
ఆంధ్రభూమిలో ఈ నెల 19న ‘పేరుకే పైసా ఖర్చులేని భూప్రక్షాళన’ పేరుతో ప్రచురితమైన కథనంపై జిల్లా, మం డల అధికారులు స్పందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు దీనిపై సోమవారం తహశీల్దార్ వెంకన్న గ్రామ రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి వెలువడిన వార్తలపై సుదీర్ఘంగా చర్చించారు. నకిలీల పట్ల జాగ్రత్తగా ఉంటూ రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.