తెలంగాణ

బాలికలపై లైంగిక వేధింపులు వృద్ధుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కుషాయిగూడ, నవంబర్ 22: మాయమాటలు చెప్పి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ వృద్ధుడిపై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ కేసు నమోదు చేశారు. సీఐ చంద్రశేఖర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాప్రా ప్రథమపురి కాలనీకి చెందిన సత్యనారాయణ (74) రైల్వే ఉద్యోగిగా పదవీ విరమణ చేశాడు. కాలనీ చుట్టుపక్కల బాలికలకు మాయమాటలు చెప్పి చాక్లెట్‌ల ఆశ చూపించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఎనిమిది మంది బాలికలపై సత్యనారాయణ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికలను వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.