తెలంగాణ

కాలుష్యం దెబ్బకు కొత్తూరు విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల గ్రామ పరిధిలో ఉన్న ఆనంద్ మెటాల్లీస్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌ను మూసివేయాలని ఆ మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు ఎ.సత్తయ్య ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌కు లేఖ రాశారు. ఈ పరిశ్రమ నుంచి విడుదలయ్యే కాలుష్యం బారిన పడి ప్రజలు ప్రాణాంతక రోగాలకు గురవుతున్నారని తెలిపారు. గతంలో తన మామ అదే గ్రామ పరిధిలో ఉంటూ ఈ పరిశ్రమ కాలుష్యం కారణంగా అనారోగ్యానికి గురై మరణించారని, ఇప్పుడు తన తల్లి కూడా అనేక రుగ్మతలకు గురై జీవిస్తోందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఒక్క ప్రజలే కాకండా పంటలు, ఇతర జీవనాధారానికి కాలుష్యం వల్ల ముప్పు వాటిల్లుతోందని అన్నారు. ఇంతేకాకుండా ఆయా ప్రాంతంలో ఉన్న ఇతర బహుళజాతి కంపెనీలైన ప్రోక్టర్ అండ్ గాంబుల్ హైజినిక్ హెల్త్‌కేర్ లిమిటెడ్, జాన్సన్ అండ్ జాన్సన్ ఇండస్ట్రీస్ యాజమాన్యాలు కూడా ఆనంద్ కంపెనీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రికి వివరించారు. ప్రోక్టర్, జాన్సన్ కంపెనీల యాజామాన్యాలు కూడా తనకు చాలా సార్లు ఆనంద్ కంపెనీ గురించి ఫిర్యాదు చేశారని అన్నారు. తాను చాలాసార్లు ఆనంద్ కంపెనీకి చెప్పినా ఆ కంపెనీ ఎండి ప్రమోద్ అగర్వాల్ లెక్క చేయడం లేదని, కోర్టు నుంచి తనకు స్టే ఆర్డర్ ఉందని చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని వివరించారు. తనకు సంబంధించినంత వరకు ఎలాంటి నష్టం జరగకుండా రాజకీయంగా, అధికారికంగా అందరిని డబ్బుతో నోళ్లు మూయించి తన పరిశ్రమను యధేచ్ఛగా అగర్వాల్ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ పరిశ్రమపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోనందుకు స్ధానికంగా టిఆర్‌ఎస్ పార్టీపైనా, ప్రభుత్వపైనా వ్యతిరేకత పెరుగుతోందని సత్తయ్య మంత్రికి ఆ లేఖలో వివరించారు. ఇప్పటి వరకు స్థానిక ప్రజలకు ఏదో ఒకటి చెబుతూ వచ్చానని, మండల పార్టీ అధ్యక్షుడిగా తన వంతు బాధ్యతగా మీ దృష్టికి ఈ విషయం తీసుకు వస్తున్నానని తెలిపారు. తక్షణమే ఆ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కోరారు.