తెలంగాణ

తెలంగాణ అభివృద్ధిలో ట్రిపుల్ ఐటి విద్యార్థుల భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్ /బాసర, ఏప్రిల్ 25: ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలం బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటీలో మొదటి స్నాతకోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఆరేళ్ల డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులకు పట్టాలను అందించే కార్యక్రమాన్ని యూనివర్సిటీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు. విద్యార్థులనుద్దేశించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ విద్యా విధానాన్ని పటిష్టపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని పేర్కొన్నారు. అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని, ట్రిపుల్ ఐటి యూనివర్సిటీ గ్రేడింగ్ విధానంలో ఉన్నత ప్రమాణాలు పాటించే విధంగా యూనివర్సిటీ అధికారులు కృషిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటీలో అన్ని ఐటి కంపెనీల క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో మాట్లాడి ఫ్యాకల్టీ సిబ్బందిని భర్తీ చేసేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఆరుగురు విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌తోపాటు 120 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైస్‌చాన్సలర్ సత్యనారాయణ, సీనియర్ ప్రొఫెసర్ రాఘవన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

చిత్రం బాసర ట్రిపుల్ ఐటి మొదటి స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి