తెలంగాణ

పరిశోధనల పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పరిశోధనా పత్రాల రచనలో పోటీ నిర్వహిస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి ప్రాతిపదికగా వ్యాసాలు ఉండాలని పేర్కొన్నారు. 10 నుండి 20 పుటల నిడివి కలిగిన పరిశోధనా వ్యాసాలు నవంబర్ 30 లోగా కార్యదర్శి, సాహిత్య అకాడమి, కళాభవన్, రవీంద్ర భారతి, సైఫాబాద్, హైదరాబాద్, 500 004 చిరునామాకు పంపించాలని సూచించారు.
పోటీలో గెలుపొందిన వ్యాసరచయితలకు బహుమతులు ఇస్తారు. ప్రథమ బహుమతి కింద 10 వేలు, ద్వీతీయ బహుమతికి 8 వేలు, తృతీయ బహుమతికి 5 వేల రూపాయలు ఇస్తారు. పది వ్యాసాలకు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. ప్రోత్సాహక బహుమతుల కింద ఒక్కొక్కరికి మూడువేల రూపాయలు ఇస్తారు.
పరిశోధనా పత్రం తమ సొంత వ్యాసమని, అముద్రితమని హామీపత్రం జత చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన వ్యాసాలను తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తకంగా ప్రచురిస్తుంది.
బహుమతులు ఎంపికలో న్యాయనిర్ణేతలదే తుదినిర్ణయమని వెల్లడించారు. సాంస్కృతిక కమిటీ
డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల కోసం సాంస్కృతిక కమిటీని ఏర్పాటు చేశారు. మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనల ఎంపిక, రూపకల్పన, నిర్ధారణ, నిర్వహణ బాధ్యతలను ఈ కమిటీకి అప్పగించారు. ఈ కమిటీలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి, ప్రముఖ సినీ దర్శకులు బి. నర్సింగరావు, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సభ్యులుగా ఉంటారు.