రాష్ట్రీయం

తూర్పు కోస్తా తీరంలో సునామీ మాక్ డ్రిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: సునామి హెచ్చరికలు జారీ అయితే, ముందస్తుగా ఏం చేయాలి, ఎంత వేగంగా స్పందించాలనే అంశంపై భారత భూగోళ శాస్త్రం నిర్వహించిన సునామీ మెగా మాక్ డ్రిల్ తూర్పు కోస్తా తీరంలోని 35 జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశం మేరకు భూగోళ శాస్త్రం పరిధిలోని భాతర జాతీయ సముద్ర విజ్ఞాన కేంద్రం, జాతీయ ప్రకృతి వైపరీత్యాల సంస్థ సంయుక్తంగా ఈ మాక్ డ్రిల్‌ను శుక్రవారం నిర్వహించాయి. పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈ డ్రిల్ రెండు గంటల పాటు ఇలా కొనసాగింది. అండమాన్ నికోబార్ దీవుల్లో తీవ్ర ప్రభావంతో కూడిన భూకంపం సంభవించబోతోందనే హెచ్చరికను సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తమ వద్ద నమోదైన మొబైల్ నెంబర్లు, ఈ-మెయిల్స్, ఫ్యాక్స్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా హెచ్చరికల సమాచారాన్ని పంపించారు. దీన్ని అనుసరించి సంబంధిత రాష్ట్రాల అత్యవసర ఆపరేషన్ల కేంద్రాలు స్పందించి తక్షణమే రంగంలో దిగాయి. అరగంట వ్యవధిలో సమాచారాన్ని ఇటు ప్రజలకు, ప్రసార మాధ్యమాలకు పంపించడం ద్వారా సంబంధిత అధికార వర్గాలకు తగిన సూచనలు సలహాలు వేగంగా చేరాయి. తీరప్రాంతంలో సునామి ప్రభావం పడుతుందని భావించిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు, అత్యవసర స్పందన వ్యక్తం చేశారు. దీంతో ఒకేసారి 34 జిల్లాల్లో సాగిన మాక్ డ్రిల్‌ను పసిఫిక్ ఐలాండ్ దేశాల నుంచి వచ్చిన 11 మంది ప్రతినిధులు స్వయంగా పరిశీలించారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు, సిద్ధం కావడం వంటివి ఇలాంటి డ్రిల్స్ ద్వారా మెరుగుపడి మంచిఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. సునామి అనేది అత్యంత సహజ సిద్ధ భారీ విధ్వంసకారిగా ఈ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. సునామీ హెచ్చరిక అంటూ జారీ అయితే నిర్ణీత గడువులోగా శరవేగంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటికైనా తూర్పు కోస్తా తీరంలో తుపానులు, సునామీల ముప్పు ఉండే అవకాశం ఉన్నందున ఈ తరహా ప్రయోగాలు చాలా ఉపయోగమని ఈ సందర్భంగా పలువురు వెల్లడించారు. 2004లో ఇండియన్ ఓషియన్‌లో సంభవించిన సునామి వల్ల తూర్పుకోస్తాపై ప్రభావం పెద్ద ఎత్తునే పడిందని గుర్తు చేసుకున్నారు.