తెలంగాణ

వినియోగంలోకి పంపులు, మోటార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: గత ప్రభుత్వాలు రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 425 కోట్ల రూపాయల విలువైన పైపులు, పంపులు, మోటార్లు హడావుడిగా కొనుగోలు చేసి ప్రాజెక్ట్ సైట్‌లో మూలనపడేశారు. కోట్ల రూపాయల పంపుసెట్ల కొనుగోలులో శ్రద్ధచూపినా, ప్రాజెక్టు పూర్తి చేసి పొలాలకు సాగునీటిని అందించాలనే ఆసక్తి మాత్రం చూపలేదు. కోట్లాది రూపాయల విలువైన ప్రాజెక్టు పరికరాలు వృధాగా పడి ఉండటంపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించింది. రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల పరికరాలను తక్షణం ఉపయోగించుకుని ప్రాజెక్టుల పని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని సాధ్యమైనంత వరకు వినియోగించుకునే విధంగా ఈ రెండు ప్రాజెక్టుల డిజైన్లు రూపొందించాలని నీటి పారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించి ప్రతిపాదనలు యుద్ధప్రాతిపదికన రూపొందించాలని ఆదేశించారు. ఈనెల 28న ఈ రెండు ప్రాజెక్టులపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షలో ప్రాజెక్టులపై నివేదికలు పరిశీలించి సిఎం అనుమతి తీసుకుంటారు. ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ కాకతీయ పనితీరుపై నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదివారం సమీక్ష జరిపారు. సమీక్షలో రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఈఎన్‌సి మురళీధర్‌రావు, సిఇలు పురుషోత్తం రాజు, సుధాకర్, నరేందర్‌రెడ్డి, ఎస్సీలు జయపాల్‌రావు, వి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వపై 17 ఎత్తిపోతల పథకాల ఆధునీకరణకు 55 కోట్లు విడుదల చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని 57 ఎత్తిపోతల పథకాలకు గిరిజన ఉప ప్రణాళిక కింద 20 కోట్లు మంజూరుచేసి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ ఫేస్ 2 కింద జిల్లాలో వెయ్యి చెరువులను పునరుద్ధరిస్తారు. పులిచింతల ప్రాజెక్టుల ముంపునకు గురవుతున్న ఎత్తిపోతల పథకాలపై ఆంధ్ర రాష్ట్ర అధికారులతో కలిసి సంయుక్తంగా సర్వే నిర్వహించి తరలించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఐడిసి యండిని ఆదేశించారు. మార్చి చివరినాటికి పాలెంవాగు స్పిల్‌వే గేట్ల నిర్మాణం పూర్తిచేయాలని చెప్పారు. వచ్చే ఖరీఫ్‌లో పాలెంవాగు కాల్వకింద 10,200 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

చిత్రం.. ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనితీరును సమీక్షిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వ రావు