రాష్ట్రీయం

మహిళాభివృద్ధికి ముఖ ద్వారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ప్రపంచ మహిళ అభివృద్ధికి జీఈఎస్ సదస్సు ముఖద్వారం వంటిదని, మహిళల గెలుపే అందరి గెలుపు అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేసిందని ఆయన కొనియాడారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామిక సదస్సు ప్రారంభం కానున్న సందర్భంగా సోమవారం నాడు ఆయన అమెరికా రాయబారి కెన్నత్ జస్టర్‌తో కలిసి హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడారు. మహిళల సాధికారితకు భారత్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. అందుకే కేంద్రప్రభుత్వం బేటీ బచావో- బేటీ పడావో పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తోందని చెప్పారు. ప్రపంచ పారిశ్రామికత సదస్సు దక్షిణాసియాలోనే తొలిసారి హైదరాబాద్‌లో జరుగుతోందని అన్నారరు. ఈ నెల 28 నుండి 30 వరకూ ఈ సదస్సు జరుగుతుందని చెప్పారు. భారత్ , అమెరికా సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయని చెప్పారు.
ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్‌తో పాటు ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు అతిరథ మహారథులు పాల్గొంటారని పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, కఠిన సవాళ్లుపై ఈ సదస్సులో చర్చిస్తామని చెప్పారు. ప్లీనరీలో ప్రధాని మోదీ, ఇవాంక ట్రంప్‌తో పాటు మరో నలుగురు వేదికపై ఆశీనులవుతారని చెప్పారు. తొలి రోజు కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పాల్గొంటారని అన్నారు. ఈ సదస్సుకు 150కి పైగా దేశాల నుండి 1500 మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతారని వివరించారు. హెచ్‌ఐసిసి వేదికగా ఈ సదస్సు సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు. సదస్సు నిర్వహణకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసేందుకు భాతర ప్రభుత్వం, యుఎస్‌లకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం నీతిఆయోగ్‌లో సమావేశం అయ్యాయని తెలిపారు.
స్కూళ్లకు సెలవు
సదస్సు నిర్వహిస్తున్న హైటెక్స్ సమీపంలోని పలు పాఠశాలలకు మంగళవారం నాడు సెలవు ప్రకటించారు. హైటెక్ ఏరియా, మాదాపూర్, మియాపూర్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతంలోని పలు ఇంటర్నేషన్ స్కూళ్లు, పబ్లిక్ స్కూళ్లు సెలవు ప్రకటించాయి. మిగిలిన ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలలు ఒంటిపూట మాత్రమే పనిచేయనున్నాయి.

చిత్రం..సోమవారం హైదరబాద్‌లో అమెరికా రాయబారి కెన్నత్ జస్టర్‌తో కలిసి మీడియాతో
మాట్లాడుతున్న నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్. చిత్రంలో తెలంగాణ సీఎస్ ఎస్పీసింగ్ ఉన్నారు