తెలంగాణ

నంది మేడారం నుంచి మిడ్‌మానేర్ వరకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 7: సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాటలో భాగంగా రెండో రోజు శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌మానేర్ వరకు హెలిక్యాప్టర్ ద్వారా బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, అండర్ టనె్నళ్లను పరిశీలన చేయనున్నారు. రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్న సంకల్పంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుతోపాటు మిడ్ మానేర్ పనుల పరిశీలనలో భాగంగా కరీంనగర్ నుంచే ప్రాజెక్టుల బాటను ప్రారంభించాలనే ఆలోచనతో బుధవారం సాయంత్రమే సీఎం కేసీఆర్ కరీంనగర్‌కు చేరుకున్నారు. మొదటిరోజు గురువారం ఉదయం కరీంనగర్ నుంచి మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీష్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి కేసీఆర్ హెలిక్యాప్టర్‌లో బయలుదేరి భూపాలపల్లి జయశంకర్ జిల్లా తుపాలగూడెం, మేడిగడ్డ బ్యారేజీలతోపాటు కనె్నపల్లి పంప్‌హౌస్‌లను పరిశీలించేందుకు తరలివెళ్లారు.
అనంతరం పెద్దపల్లి జిల్లాలోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోపాటు సిరిపురం, గోలివాడ పంప్‌హౌస్ పనులను కేసీఆర్ పరిశీలించారు. పనులను తీరును ఇంజనీర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల మరింత వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశీలనల అనంతరం సాయంత్రం రామగుండంలోని ఎన్టీపీసీలోని అతిథి గృహానికి చేరుకుని, రాత్రి ఇక్కడే బస చేస్తారు. తిరిగి రెండోరోజు శుక్రవారం సీఎం కేసిఆర్ పర్యటన నంది మేడారం నుంచి మిడ్‌మానేర్ వరకు కొనసాగనుంది. ఉదయం ధర్మారం మండలం నంది మేడారం పంప్‌హౌస్ వద్దకు చేరుకుని, మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఇక్కడి నుంచి 12:20 గంటల వరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని సొరంగ పనుల వద్దకు చేరుకుని, పనులను పరిశీలించి భోజనం చేస్తారు.
అనంతరం ఇక్కడే ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కేసీఆర్ సమీక్షించి అధికారులకు దిశ నిర్దేశనం చేయనున్నారు. 2:45 గంటలకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌లోని పంప్‌హౌస్ పనుల వద్దకు చేరుకుని, 3:15 గంటల వరకు పరిశీలిస్తారు. ఇక్కడి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌మానేర్‌కు 3:40 గంటల వరకు చేరుకుని, 3:45 గంటల వరకు పరిశీలిస్తారు. అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి 4:30 గంటల వరకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగనున్నారు. మొదటిరోజు పర్యటన పూర్తి కాగా, రెండో రోజు పర్యటనకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. రెండోరోజు కొనసాగే పర్యటన ప్రాంతాల్లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్ గురువారం పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అయితే, మహారాష్టల్రో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన దరిమిలా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. వరంగల్ ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో సీఎం పర్యటన ప్రాంతాల్లో భారీ బందోబస్తు చర్యలను కొనసాగిస్తున్నారు. మీడియాను సైతం అనుమతించకపోగా, పరిమితి సంఖ్యలో, అందులోనూ ముఖ్య నేతలు, అధికారులను మాత్రమే అనుతిస్తున్నారు.
చిత్రం..సుందిళ్ల బ్యారేజీ పనులను పరిశీలిస్తున్న కేసీఆర్