తెలంగాణ

స్మార్ట్ సిటీ పథకం కింద భద్రకాళి, వెయ్యి స్తంభాల గుడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: స్మార్ట్ సిటీ కింద వరంగల్‌లోని భద్రకాళి సరస్సు, వెయ్యి స్తంభాల గుడి పరిసర ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరుచాలని మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 8వ బోర్డు సమావేశం గురువారం ఇక్కడ జరిగింది. మున్సిపల్ పాలనా డైరక్టర్ టికె శ్రీదేవి, వరంగల్ అర్బన్ కలక్టర్ అమ్రపాలి, వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రుతి ఓజా, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఈ సమావేశానికి హాజరయ్యారు.
స్మార్ట్ సిటీస్ కార్యక్రమం కింద వరంగల్‌లోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధికి రూ.13.5 కోట్లు, రోడ్ల అభివృద్ధి, విస్తరణకు 74.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్టు నవీన్ మిట్టల్ వెల్లడించారు. భద్రకాళి చెరువు సమగ్ర అభివృద్థికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాల్సిందిగా నవీన్ మిట్టల్ ఆదేశించారు. రెడ్డిపురంలో మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదించినట్టు చెప్పారు. భద్రకాళి ఆలయం నుంచి పద్మాక్షిగుట్టకు రోప్ వే ఏర్పాటును స్మార్ట్ సిటీ పథకం కింద అదనంగా చేర్చాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ నివేదిక సమర్పించారు.
చిత్రం..వరంగల్ స్మార్ట్ సిటీ పథకంలో చేర్చిన కార్యక్రమాలపై
అధికారులతో సమీక్షిస్తున్న మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్