తెలంగాణ

గుజరాత్ ఫలితాల తర్వాత రాష్ట్రంలో పెనుమార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 7: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వంత రాష్ట్రం గుజరాత్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని, అక్క డి ఫలితాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా రాజకీయంగా పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తూ గురువారం జిల్లాకేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ అవినీతి రహిత పాలన కొనసాగిస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. మోదీ అమలు చేస్తున్న పథకాలు, అనుసరిస్తున్న విధానాల ఫలితంగా బీజేపీకి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందన్నారు. తెలంగాణలోనూ పార్టీ పటిష్టమవుతుందని ఇటీవల రాష్టవ్య్రాప్తంగా కొనసాగుతున్న చేరికలే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో విద్యార్థులు, నిరుద్యోగులు మలిదశ ఉద్యమంలో ముందుండి పనిచేశారన్నారు. వారి ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ పాలన కొనసాగుతుండంతో రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగాలు రావనే నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 12 వేల ఉద్యోగాలను భర్తీ చేసే వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమిస్తున్న వారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ వైఖరిని అవలంభిస్తూ అక్రమంగా కేసులను నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలను అమలుచేసినా ప్రజలు, నిరుద్యోగులు, రైతుల పక్షాన నిలిచిపోరాడుతామన్నారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపించారు. భూదందాలు, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.