తెలంగాణ

మిషన్ భగీరథ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథతో పాటు మిగిలిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర అధికార బృందం ప్రశంసించింది. మిషన్ భగీరథను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ యోచిస్తున్నారని అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అధ్యయనంలో భాగంగా కేంద్రప్రభుత్వ అధికారుల బృందం విచ్చేసింది. సెంట్రల్ సెక్రటేరియట్‌లో అండర్ సెక్రటరీలుగా పదోన్నతి పొందిన 10 మంది అధికారులు ఈ బృందంలో ఉన్నారు. మిషన్ భగీరథతో పాటు స్వచ్ఛ్ భారత్ (గ్రామీణ) కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. మిషన్ భగీరథపై ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సురేందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. ప్రతి ఇంటికీ రక్షిత మంచి నీటిని అందించడమే తమ లక్ష్యమని అన్నారు. సిఎం కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ నాటికి అన్ని ఆవాసాలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించడం జరుగుతుందని తెలిపారు.