తెలంగాణ

మిషన్ కాకతీయ-4 వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: మిషన్ కాకతీయ నాలుగవ దశ పనుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. నాలుగవ దశలో చేపట్టనున్న చెరువుల పునరుద్ధరణకు సంబంధించి శుక్రవారం నాడు 15 జీవోలు విడుదల చేసింది. 149 చెరువులకు పునరుద్ధరణ పనుల కోసం రూ.45 కోట్లను మంజురు చేసినట్టు నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో మరో 10 చెరువుల నిర్మాణాలకు పాలనాపరమైన అనుమతి ఇవ్వడంతో పాటు రూ.15.59 కోట్లు మంజురు చేసినట్టు మంత్రి తెలిపారు. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 18 చెరువులు, ఖమ్మం జిల్లాలో 11 చెరువులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజురు చేసినట్టు పేర్కొన్నారు.