తెలంగాణ

పనులు వేగిరం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ప్రపంచ తెలుగు మహాసభల పనులను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సంగ్ ఆదేశించారు. మహాసభల పనులపై శనివారం ఆయన ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఎల్‌బి స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న ప్రధాన వేదిక, ప్రతినిధులు కూర్చునే సీటింగ్ ఏర్పాట్ల లేఅవుట్‌పై పరిశీలించారు. ప్రతినిధులకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన భోజనాన్ని, తెలంగాణ రుచులతో అందించాలని సూచించారు. ఎల్‌బి స్టేడియంతో పాటు సభలు జరగే అన్ని వేదికల వద్ద తెలుగులో సూచికలు పెట్టాలన్నారు. మెసర్స్ విజ్ క్రాఫ్ట్ ద్వారా లేజర్ షో ఏర్పాట్లపై సమీక్షించారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా ఉండేలా పోలీసుల విభాగం చూడాలని డిజిపిని ఆదేశించారు. ప్రతినిధులు వసతి గృహాల నుండి వేదికలకు వచ్చేందు, తిరిగి వెళ్లేందుకు వాహనాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ఫకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎస్‌ఎంఎస్, ఇ-మెయిల్‌ద్వారా అందించాలని కోరారు. వివిధ శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సిఎస్ ఆదేశించారు.