తెలంగాణ

ఎస్టీ జాబితానుంచి లంబాడీలను తొలగించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఎల్‌బీనగర్, డిసెంబర్ 9: లంబాడీలను ఆదివాసీల నుంచి తొలగించాలని కొమురం భీం మనువడ కొమురం సోలేవాల్ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొమురంభీం స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. ఆదివాసీలకంటూ ప్రత్యేక రిజర్వేషన్ కావాలని కోరారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు చేపట్టిన ఆత్మగౌరవ బహిరంగ సభ విజయవంతమైంది. శనివారం ఎల్‌బీనగర్ ఇండోర్‌స్టేడియంలో చేపట్టిన బహిరంగసభకు వివిధ జిల్లాల నుండి ఆదివాసిలు అధిక సంఖ్యలో పాల్గొడంతో ప్రాంగణం జనంతో దద్దరిల్లి పోయింది. ఉదయం నుండే ఎల్‌బీనగర్ పరిసర ప్రాంతాలలో జనం అధిక సంఖ్యలో కనిపించారు. జనం అధిక సంఖ్యలో రావడంతో వారికి మంచినీరు, ఆహారం అందక ఇబ్బందులు పడ్డారు. వచ్చిన వారికి మలమూత్ర విసర్జనకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. జనం స్టేడియంలో సరిపోక బయటనే ఉండిపోయారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన కేంద్రమాజీ మంత్రి, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు, ఎస్టీ, ఎస్సీ పార్లమెంట్ కమిటి చైర్మన్ పగన్‌సింగ్‌కులస్తి మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితానుండి తొలగించే డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచుతానని అన్నారు. 1981సంవత్సరంలో తెలంగాణలో 60వేల మంది లంబాడీలు ఉంటే ఇప్పుడు 24లక్షల మంది ఉన్నారని ఫిర్యాదులు వచ్చాయని వాటిపై విచారణ జరిపిస్తామని అన్నారు. ఉద్యోగాలలో గిరిజనులు కాకుండ ఇతరులను ఉంచుతున్నారని ఆరోపించారు. ఆదివాసిల డిమాండ్లకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నగేష్ మాట్లాడుతూ 40సంవత్సరాల నుండి ఆదివాసులు అన్యాయానికి గురి అవుతున్నారని అన్నారు. ఆదివాసిల న్యాయమైన కోరికలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయబాబురావు మాట్లాడుతూ లంబాడిలను ఎస్టీ జాబితానుండి 15రోజులలో తొలగించాలని లేనిచో డిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ లంబాడీలను వెనుకేసుకొస్తున్నాడని ఆరోపించారు. వెనుబడిన ఆదివాసిలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికైన ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించి వెనుకబడిన ఆదివాసిలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
స్థంభించిన ట్రాఫిక్
ఎల్‌బీనగర్ నుండి ఉప్పల్ మీదుగా మెట్రో రైల్ పనులు జరుగుతుండడంతో ఆదివాసిల బహిరంగ సభ కారణంగా ట్రాఫిక్ స్థంభించి పోయింది. బహిరంగ సభకు జనం అధిక సంఖ్యలో రావడంతో స్టేడియంలో స్థలం సరిపోక బయటకు వచ్చేశారు. వివిధ జిల్లాల నుండి భారీ వాహనాలలో వచ్చిన జనం రోడ్డు మలుపులు వద్ద ట్రాఫిక్ స్థంభించి పోయింది. ట్రాఫిక్‌ను సరిచేసేందుకు పోలీసులు ఇబ్బందులు ఎదుర్కున్నారు.