తెలంగాణ

ప్రథమ స్థానానికి ఉరకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మొదటి ర్యాంకును రెండోసారి వరుసగా చేజిక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉరకలేస్తోంది. పరిశ్రమల ఏర్పాటు, వాటికి అనుమతులు ఇవ్వడం, ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన సంస్కరణలను, వాటి ఫలాలను సామాన్యులకు అందించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణకు వరసగా రెండోసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి ర్యాంకు ఖాయమంటున్నారు. సరళ వ్యాపార విధానాల్లో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) తెలంగాణ మొదటి ర్యాంకుకు చేరువలో ఉంది. 2016లో దేశం మొత్తం మీద తొలి ర్యాంకును సాధించి పరిశ్రమలకు అనుమతులు, సంస్కరణల అమలులో ప్రపంచానికి తెలంగాణ తన సత్తా చాటింది. ఈ సారి ప్రాథమిక ర్యాంకుల్లో హర్యానాకు అతి చేరువలో తెలంగాణ రాష్ట్రం ఉండడం విశేషం. ఇంతవరకు టాప్ పది ర్యాంకుల్లో హర్యానా 69 పాయింట్ల స్కోరుతో ఉండగా, తెలంగాణ 68.46 పాయింట్లతో ఉంది. ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది. త్వరలో కేంద్రం ఆధీనంలోని డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి) తెలంగాణలో పర్యటించి వివిధ సంస్కరణల అమలు తీరును పరిశీలించనుంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో సంస్కరణల అమలు తీరును సమీక్షిస్తున్నారు. వివిధ సంస్కరణల అమలు తీరు తెన్నులను సమీక్షించి, ఇంతవరకు తీసుకున్న చర్యలను నిశితంగా పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తున్నారు. మంత్రి కెటిఆర్ వారానికోసారి, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి 15 రోజులకోసారి సమీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించి తగిన దిశ, దశ నిర్దేశానికి ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాల కనె్సల్టింగ్ సంస్థ గ్లోబల్ కనె్సల్టెన్సీ ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఈ ఏడాది డిఐపిపి కొత్త వాణిజ్య సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. దీనిపై రాష్ట్రాలు తీసుకున్న చర్యలు, సలహాలను కొత్త ఫార్మెట్‌లో పంపించాలని డిఐపిపి కోరింది. ఈ సంస్కరణల అమలు ప్రాతిపదికన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలుకు ర్యాంకులను ప్రకటిస్తారు. కొత్త ర్యాంకింగ్ ఇచ్చేందుకు 294 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 13 సచివాలయ శాఖలు , 27 హెడ్ ఆఫ్ దిడిపార్టుమెంట్స్ ఉన్నాయి. ఇందులో వ్యవసాయం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఆహారం పౌరసరఫరాలు, రోడ్లు భవనాల శాఖలను కొత్తగా ఈ ఏడాది చేర్చారు. వీటి అభివృద్ధి సూచికలు ఆధారంగా ఈజ్ డూయింగ్ బిజినెస్‌కు సూచికలను ఖరారు చేస్తారు. మరో ఎనిమిది కమిషనరేట్లు వ్యవసాయ శాఖ, ఆయుర్దేవం, వైద్య శాఖ డైరెక్టరేట్, ఔషధ నియంత్రణ శాఖ, కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ, ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్, మైన్స్ జియాలజీ, చీఫ్ ఎలక్ట్రికల్ ఇనెస్పెక్టరేట్ శాఖలను హెడ్ ఆఫ్ డిపార్టుమెంట్స్ జాబితాలో చేర్చారు.
ఈర్యాంకుల ఖరారుకు 340 పాయింట్లను సాధారణగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సారి డిఐపిపి మరో 32 పాయింట్లను కలిపింది. దీంతో 372 పాయింట్లలో వివిధ రాష్ట్రాలు సాధించిన ప్రగతి, సంస్కరణల అమలును పరిగణనలోకి తీసుకోనున్నారు.