తెలంగాణ

ధర్మయుద్ధం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ‘వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై ఇక ధర్మయుద్ధం చేద్దాం..’ అని ఇటీవల టి.టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలన్నారు. సోనియా గాంధీ జన్మదినోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తూ కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని తూర్పారబట్టారు. కేసీఆర్ వియ్యంకునిపైనా ఆరోపణ చేశారు. దీనిపై సిఎం చర్యలు తీసుకోవాలని, ఆరోపణ తప్పు అయితే తనపై కేసు పెట్టాలని అన్నారు. మెదక్ జిల్లాకు టి.పిసిసి అనుబంధ విభాగమైన ఎస్‌టి కమిటీని నిజ నిర్థారణ కమిటీగా పంపించాలని ఆయన కోరారు. కేసీఆర్‌పై చేసే ధర్మయుద్ధమే తుది దశ ఉద్యమం అవుతుందన్నారు. కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యిందన్నారు. కేసీఆర్ నుంచి తెలంగాణ విముక్తి కోసం ఎవరూ టిడిపి, బిజెపి జెండాలు పట్టవద్దని, కేవలం కాంగ్రెస్ జెండాలే పట్టాలన్నారు. కాంగ్రెస్ చేపట్టిన వివిధ పథకాల వద్ద మంత్రి కెటిఆర్ సెల్ఫీలు దిగుతున్నారని ఆయన విమర్శించారు. గుడిలాంటి గాంధీ భవన్‌కు వచ్చినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు.
ఇలాఉండగా రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నుంచి పెద్ద సంఖ్యలో తన అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కలిసి గాంధీ భవన్‌కు ఊరేగింపుగా వచ్చారు. రేవంత్ ఊరేగింపుతో ఆ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. గాంధీ భవన్ ఆవరణ అంతా కార్యకర్తలతో నిండిపోయి కిటకిటలాడింది. రేవంత్ ప్రసంగించేందుకు ఉద్యుక్తులుకాగానే కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. సోనియా జన్మదినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు.