తెలంగాణ

ఘనంగా నాగార్జున సాగర్ డ్యాం శంకుస్థాపన దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, డిసెంబర్ 10: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన దినోత్సవాన్ని ఆదివారం డ్యాం అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఆదివారం నాటికి 62 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డ్యాం పునాది రాయి వద్ద రంగులతో, విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మొదటిసారిగా రాష్ట్ర మంత్రులు హాజరైనందున ఎంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం రాత్రే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి సాగర్ విజయవిహార్ అతిథి గృహానికి చేరుకొని ఇక్కడే బస చేశారు.
ఆదివారం ఉదయం 9.15 గంటలకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి హెలికాప్టర్ ద్వారా నాగార్జునసాగర్ బుద్ధవనంలోని హెలీప్యాడ్‌లో దిగారు. అక్కడ వీరికి మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, రాష్ట్ర అటవీ సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, టీఆర్‌ఎస్ సాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విజయవిహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరు నేరుగా పైలాన్ కాలనీలోని ప్రధాన డ్యాం వద్ద ఉన్న సాగర్ డ్యాం పునాది రాయి వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం డ్యాం నిర్మాణంలో అమరులైన కార్మికులకు గుర్తుగా నిర్మించిన స్మారక స్థూపం వద్ద మంత్రులు హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి కార్మికులకు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్దకు చేరుకొని అక్కడ లాల్‌బహదూర్ శాస్ర్తీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, డ్యాం సీఈ సునీల్‌కుమార్, ఎస్‌ఈ రమేష్, ఈఈ వెంకట్‌రెడ్డి, పెద్దవూర ఎంపీపీ వస్తపూరి మల్లిక, తహశీల్దార్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా మంత్రుల పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.