తెలంగాణ

రాజకీయ పార్టీలన్నీ బీసీ డిక్లరేషన్ ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బిసి డిక్లరేషన్ ప్రకటించాలని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బిసి అజెండాతోనే వచ్చే ఎన్నికల్లో బిసి ఉద్యమాన్ని పల్లెపల్లెకు తీసుకెళతామని అన్నారు. ఆదివారం నాడిక్కడ బిసి సంఘాల విస్తత్ర స్థాయి సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. వచ్చే మార్చి నెలలో 10 వేల మంది బిసి ప్రతినిధులతో బిసి ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయం, సమాన వాటా కోరుతూ ఈ నెల 30న విద్యార్థి గర్జన, జనవరిలో హైదరాబాద్‌లో ఉద్యోగుల మహాసభ, ఫిబ్రవరిలో యాదాద్రిలో బిసిల రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనాభాలో 50 శాతం ఉన్న బిసిలకు వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం బిసిల పట్ల స్పందించి పలు వరాలు ప్రకటించిందంటే అది తమ పోరాట ఫలితమేనని జాజుల అన్నారు. బిసి ప్రతినిధుల నివేదికను యధాతథంగా అమలు చేసి మిగిలిన రాష్టల్రకు ఆదర్శంగా నిలవాలని ఆయన సిఎం కెసిఆర్‌ను కోరారు.