తెలంగాణ

ఆదివాసీ గిరిజన హక్కులపై ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనని, అవి ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ప్రజా సంక్షేమాలను పూర్తిగా విస్మరించాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. గతంలో పదేళ్ల పాటు జరిగిన కాంగ్రెస్ అవినీతిని ప్రజలు ఇంకా మరిచిపోలేదని అన్నారు. తెలంగాణలోని నాలుగు జిల్లాల పర్యటన ముగించుకున్న తర్వాత బిజెపి కార్యాలయంలో సోమవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత, తటస్థులు, ప్రజలు పెద్ద ఎత్తున బిజెపిలో చేరుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని , ఆయన పేదరికంపైనా, సామాజిక వర్గంపైనా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఒక పేదవాడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రధాని కావడం, కోట్లాది ప్రజల మన్ననలను చూరగొనడం సహించలేకపోతున్నారని అన్నారు. వారసత్వ రాజకీయాలకు భిన్నంగా ప్రధాని అయిన మోదీ పట్ల ఎందుకు ఇంత అసహనం ప్రకటిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
2019 ఎన్నికల కోసం పంచాయతీ నుండి పార్లమెంటు వరకూ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు లక్ష్మణ్ తెలిపారు. సిర్పూర్-కాగజ్‌నగర్‌లో ప్రజాపోరు సభకు దాదాపు 10వేల మంది హాజరై విజయవంతం చేశారని అన్నారు. కోదాడలో నాలుగువేల మంది పార్టీలో చేరినట్టు తెలిపారు. ఖమ్మంలో బహుజన సమాజ్ పార్టీ నేత గాజుల శ్రీనివాస్‌తో సహా దాదాపు 500 మంది, కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి నాయకత్వంలో మూడు వేల మంది , సూర్యాపేటలో దాదాపు 500 మంది టిఆర్‌ఎస్ నాయకులు, పిసిసి అధ్యక్షుడి ఇలాకా హుజుర్‌నగర్‌లో 2వేల మంది బిజెపిలో చేరినట్టు లక్ష్మణ్ తెలిపారు. అమిత్‌షా పర్యటనకు పూర్వం, చింతన్‌బైఠక్ నిర్వహించి రాష్ట్రంలో తాజా పరిస్థితులపై జాతీయ అధ్యక్షులకు తుది నివేదిక ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. నిరుద్యోగ సమస్యపై సమరభేరి, మద్యంపై మహిళా మోర్చా యుద్ధం ప్రకటించిందని, దళితుల సమస్యలపై దళిత మోర్చా దర్బార్ నిర్వహించిందని లక్ష్మణ్ అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న బీసీ బిసి వ్యతిరేక విధానాలపై పోరాడతామని, ఆదివాసీ గిరిజన హక్కుల కోసం ఉద్యమానికి శ్రీకారం చుడతామని, త్వరలోనే రైతు పోరు సభలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యదర్శి టి ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధులు కృష్ణసాగర్, మీడియా కమిటీ కన్వీనర్ వి సుధాకర్‌శర్మ పాల్గొన్నారు.
పార్టీలోకి అనిల్‌రెడ్డి
కరీంనగర్‌కు చెందిన పారిశ్రామిక వేత్త అనిల్‌రెడ్డి ,ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి అహ్వానిస్తూ లక్ష్మణ్ కండువాలు కప్పారు.
చిత్రం..సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ నేత లక్ష్మణ్