తెలంగాణ

సానుకూల వైఖరితో ఆలోచించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షలకు హాజరై ఎంపికైన ఇద్దరు కానిస్టేబుల్ అభ్యర్థులు గతంలో అమ్మాయిల పట్ల ఆకతాయిగా వ్యవహరించిన కేసులు వెలుగు చూడడంతో బోర్డు ఉద్యోగాలకు వారి అభ్యర్థిత్వాలను తిరస్కరించింది. ఈ ఇద్దరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఇద్దరు అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకునే విషయమై సానుకూల వైఖరితో ఆలోచించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు మరో నలుగురు కూడా తమ అభ్యర్థిత్వాలను పరిశీలించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పిటిషనర్లు తమపై ఉన్న అభియోగాలు దాయలేదని, పైగా కోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేసిందని హైకోర్టు పేర్కొంది. ఎటువంటి పరిస్ధితుల్లో వీరు నేరం చేశారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. అవతార్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జీవో 840 అమలుపై వారం రోజుల్లో వివరణ ఇవ్వండి
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కింద కొండం చెర్వు, ముంచిప్ప చెరువును విలీనం చేసి రిజర్వాయర్‌ను నిర్మించే విషయమై ప్రభుత్వం జారీ చేసిన జీవో 840ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వారం రోజుల్లోగా తనవైఖరిని తెలియచేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.బి ఈశ్వర్ సింగ్ మరో 60 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తిత జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి విచారించారు. పిటిషనర్ తరఫున వి రఘునాథ్ అనే న్యాయవాది, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసును వారం రోజుల పాటు వాయిదా వేశారు.
అగ్రిగోల్డ్ కేసుపై విచారణ
అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు పత్రిక నోటిఫికేషన్ ఇచ్చందుకు అనుమతించాలన్న ఎస్సెల్ జీ గ్రూప్‌కు చెందిన సుభాష్ చంద్ర ఫౌండేషన్ సంస్థ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించాలన్న కేసును హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ కేసులో ఎస్సెల్ గ్రూప్ సీనియర్ న్యాయవాది పి శ్రీరఘురాం వాదనలు వినిపించారు. అగ్రిగోల్డ్ కంపెనీలను టేకోవర్ చేసేందుకు మీ సంస్థ సిద్ధంగా ఉందా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై తమ అభిప్రాయాలను తెలియచేస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.