తెలంగాణ

బీసీలకు సబ్ ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: ఎస్సీ,ఎస్టీల తరహాలో బిసిలకు కూడా సబ్‌ప్లాన్ అమలుచేయాలని బిసి సంక్షేమ శాసనసభ కమిటీలో మొదటి అంశంగా చేర్చినట్టు బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం నాడు అసెంబ్లీలో స్పీకర్ మధుసూధనాచారి, ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన సచివాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. బిసి జనాభా సంఖ్యను ఖచ్చితంగా తెల్చేందుకు బిసి కమిషన్ ద్వారా త్వరలో సర్వే నిర్వహిస్తామని అన్నారు. బిసి స్కిల్స్‌కు మరింత పదును పెట్టేందుకు 100 ఎకరాల విస్తీర్ణంలో పూలే పేరిట బిసి ఆత్మగౌరవ భవన్ ఏర్పాటు చేయాలని కమిటీలో నిర్ణయించినట్టు చెప్పారు. స్థానిక సంస్థల్లో 50 శాతం, ఎలెక్టెడ్, సెలెక్టెడ్ పోస్టుల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రికి నివేదిస్తామని అన్నారు. విద్య, ఉద్యోగాల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించినట్టు చెప్పారు. ప్రతి జిల్లాలో రెండు చొప్పున 62 డిగ్రీ, 62 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. కొత్తగా 119 బిసి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. 31 జిల్లాల్లో నిరంతరంగా కోచింగ్ కేంద్రాలు కొనసాగుతాయని, బిసిలకు కాంట్రాక్టు పనుల్లో కోటి వరకూ ఈఎండిలో మినహాయింపు ఇవ్వాలని, పారిశ్రామిక రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ర్యాంకులతో సంబంధం లేకుండా విద్యార్థులు అందరికీ ఫీజు రియింబర్స్‌మెంట్ కల్పించాలని కమిటీ నిర్ణయించింది. కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు కల్పించాలని, బిసి న్యాయవాదులకు స్టయిఫండ్ పెంచాలని, సంచార జాతులకు డబుల్ బెడ్‌రూంలు నిర్మించాలని, సబ్సిడీని ఎంబిసి కార్పొరేషన్ ద్వారా అందజేయాలని ప్రతిపాదించినట్టు మంత్రి వెల్లడించారు. కాగా కేంద్రం నుండి అటవీ అనుమతులు సాధించడంలోనే తెలంగాణ ముందను వరుసలో ఉందని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అటవీ అనుమతులను కేంద్రం నుండి సత్వరమే సాధించిన ఘనత అటవీ శాఖకే దక్కుతుందని అన్నారు.