తెలంగాణ

2019లో గెలుపే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: 2019లో తెలంగాణ రాష్ట్ర సమితిని తిరిగి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా దీక్ష బూనాలని పార్టీ నాయకులు, శ్రేణులకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పిలుపునిచ్చారు. కేసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. మంగళవారం వరంగల్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిలతో బాలమల్లు సమావేశమయ్యారు. ఇన్‌చార్జిలుగా ఉన్న ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామెల్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ పరిస్థితి పటిష్టతపై తీసుకోవాల్సిన చర్యలు, సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. మండల, నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని, పూర్తిస్థాయిలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికలకు సమాయత్తం కావాలని, అందుకు తగ్గట్టుగానే కేడర్‌ను సిద్ధం చేయాలన్నారు. గ్రామగ్రాన కరపత్రాలు, బుక్‌లెట్లు పంచుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని లమల్లు సూచించారు.