తెలంగాణ

తెలంగాణ తల్లి విగ్రహాలను ఏమి చేస్తారు?: దాసోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రపంచ మహా సభల పేరిట రాష్ట్ర ప్రభుత్వం మరో ఈవెంట్‌కు హైదరాబాద్‌ను వేదిక చేసిందని, ప్రభుత్వం పాలన చేయడం మానేసి ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తున్నదని టి.పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రూ.50 కోట్ల ప్రజాధనంతో ప్రపంచ మహా సభలు నిర్వహిస్తారా? అని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సాహిత్యానికి, సంస్కృతికి అవమానం జరుగుతున్నదని, తెలుగు తల్లి కాదు దయ్య, దిక్కుమాలిన తల్లి అంటూ అవహేళని చేసిన టిఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు ప్రపంచ తెలుగు మహా సభలు అంటూ మరో ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారని ఆయన విమర్శించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు రాకపోతే తెలుగు తల్లికి ఎందుకు కన్నీరు రావడం లేదని, మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తెలుగు తల్లి ఎందుకు ఏడ్వలేదని ప్రశ్నించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎలా తెలుగు మహాసభలు నిర్వహిస్తారని, తెలుగు తల్లిని పూజిస్తారని ఆయన ప్రశ్నించారు. పైగా తెలుగు వేరు, తెలంగాణ వేరు అని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాలను ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు. అందేశ్రీ, గద్దర్‌ను పిలవకుండా మహా సభలు ఎలా చేస్తారని శ్రవణ్ ప్రశ్నించారు. పాత నగరంలో మెట్రో రైలు పనులు ఎప్పుడు చేపడతారని టి.పిసిసి ప్రధాన కార్యదర్శి జి. నిరంజన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మజ్లిస్ నాయకుల కుట్ర వల్లే పనులు ప్రారంభం కావడం లేదని ఆయన విమర్శించారు.