తెలంగాణ

సరోగసిపై కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: అద్దె గర్భం కేసులకు సంబంధించిన అంశాలపై పరిశీలనకు ప్రభుత్వం రెండు కమిటీలను నియమించింది. గతంలో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీలలో స్వల్పమార్పులు, చేర్పులు చేశారు. సరోగసి కమిటీకి చైర్మన్‌గా జస్టిస్ గోపాల్‌రెడ్డి (రిటైర్డ్ జడ్జి) ని నియమించారు. ఆరోగ్య శాఖ కమిషనర్, వైద్యవిద్య డైరెక్టర్, టిఎస్‌ఎంసి ఎథికల్ కమిటీ చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ బాలంబ (రిటైర్డ్ గైనకాలజీ), ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ అనురాధ, డాక్టర్ మాలతి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌లను సభ్యులుగా నియమించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ కమిటీకి వైద్య విద్య డైరెక్టర్‌ను చైర్మన్‌గా నియమించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్, నిమ్స్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, నిమ్స్‌లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌లను సభ్యులుగా నియమించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.