తెలంగాణ

ఇంటికో ఉద్యోగం కాదు.. ఊరికో ఉద్యోగమైనా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, డిసెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్ రాష్ట్రం సాధించుకున్నాక కనీసం ఊరికో ఉద్యోగం కూడా లేదని, రైతుల్లాగే నిరుద్యోతీ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సిరిసిల్లలో గత నాలుగు రోజులుగా నిరవధిక దీక్షలు చేపడుతున్న ‘సెస్’ కాంట్రాక్టు బిల్ కలెక్టర్లు, బిల్లింగ్ రీడర్ల శిబి రాన్ని మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధులు, నీళ్ళు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం సాగించారని, కానీ అధికారంలోకి వచ్చాక యువతను, నిరుద్యోగులను, అన్ని రంగాలను విస్మరించారన్నారు. సెస్ పాలక వర్గం మూకుమ్మడిగా 77 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.
ప్రస్తుత పాలకవర్గం వారి అనుయాయులను ఈ స్థానాలలో నియమించి, అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించుకునే ఆశ లో ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు తెలిపారు. దీనిపై సంస్థ పాలకవర్గం, ప్రభుత్వం సమాధానం ఇవ్వాలన్నారు. సెస్‌లో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ముఖ్య మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దీనిపై దృష్టి సారించాలన్నారు. మూకుమ్మడిగా 77 మందిని తొలగించిన దానిపై స్థానిక ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తూ, ముఖ్య మంత్రి కుమారుడు అయినందున వెంటనే స్పందించి వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, 13 ఏళ్ళుగా సేవలందించిన వీరికి ఉద్యోగ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకుడు గడ్డం రవీందర్‌రెడ్డి, సరేశ్‌బాబు, శ్రీనివాస్, జ్యోతి, శశికల, అరుణ, సరిత, లావణ్య, వేణు, వాసు, మహేందర్, నాజర్, అనిల్, ప్రకాశ్‌రాజు, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..సిరిసిల్లలో ‘సెస్’ కాంట్రాక్టు బిల్ కలెక్టర్లు, బిల్లింగ్ రీడర్ల దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న ఆది శ్రీనివాస్