తెలంగాణ

పక్కదారి పట్టిన ఫించన్ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 12: సమాజంలో ఒంటరి జీవితం గడుపుతున్న మహిళలకు ఆపన్న హస్తం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో అమలు చేస్తు న్న ఒంటరి మహిళ పింఛన్ పథకం అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల వత్తిళ్లతో పక్కదారి పట్టింది. భర్తతో కాపురం చేస్తున్న రెండవ భార్యకు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తుండగా, భర్తకు దూరంగా ఒంటరి జీవితం గడుపుతున్న మొదటి భార్య కు ఈ పథకం అందని ద్రాక్షగా మారి న ఉదంతం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో వెలుగు చూసింది.
ఈపథకం పక్కదారి పట్టిన విషయాన్ని మొదటి భార్య మంగళవారం జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన మాచేపల్లి క్రిష్ణకు 25 సంవత్సరాల క్రితం సదాశివపేట పట్టణానికి చెందిన యాదమ్మతో వివాహమైంది. ఈ దంపతులకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. వివాహమైనప్పటి నుంచి దంపతుల మధ్య తరుచుగా గొడవలు చోటుచేసుకోవడం, గ్రామ పెద్దలు నచ్చజెప్పడం, చివరకు పోలీసు స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, ఎస్పీల వరకు ఈ దంపతుల సమస్య వెళ్లింది. ఎక్కడ కూడా పరిష్కారమార్గం లేకపోవడంతో గత్యంతరం లేక యాద మ్మ పుట్టింటికి చేరుకుంది. కాగా, క్రిష్ణ మాత్రం గ్రామానికి చెందిన శ్రీమతమ్మను కులాంతర వివాహం చేసుకుని కాపురం చేస్తున్నాడు. ఇలాంటి భర్తలకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు ఆర్థిక చేయూతను అందించాలనే సమున్నత లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఒంటరి మహిళ పింఛన్ పథకం మాత్రం మారేపల్లి గ్రామంలో మాచేపల్లి క్రిష్ణకు రెండవ భార్యగా కాపురం చేస్తున్న శ్రీమతమ్మ ఒంటరి మహిళ పింఛన్‌ను దర్జాగా పొందుతున్నారు. అధికారుల రికార్డుల్లోనే శ్రీమతమ్మ పేరు కనిపించడం గమనార్హం. కాగా, భర్తకు దూరంగా ఉంటున్న మొదటి భార్య యాద మ్మ సదాశివపేట పట్టణంలో ఒంటరి మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారుల నిర్లక్ష్యం కారణం గా అతీగతి లేకుండా పోయింది. ప్రభుత్వం ఆపన్నుల కోసం అమలు చేస్తున్న పథకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నా అధికారుల తప్పిదాల వల్ల అనర్హులు లబ్దిపొందుతూ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. ఈ విషయమై స్పందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మానిక్యరాజ్ కణ్ణన్ విచారణ చేయించి తగిన చర్యలు తీసుకుంటామనిబాధితురాలు యా దమ్మకు భరోసా ఇచ్చారు. పక్కదారి పట్టిన ఒంటరి మహిళ పింఛన్ పథకంపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేయిస్తే మరెన్నో సంఘటనలు వెలుగు చూసే అవకాశం లేకపోలేదని విశే్లషకులు పేర్కొంటున్నారు.