తెలంగాణ

కేంద్రంపై ఉదాసీనత ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రం విషయంలో ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో పొన్నం విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ హక్కులకోసం పార్లమెంట్‌లో ఎంపీలు పోరాటం చేయడం లేదని మండిపడ్డారు. విభజన హామీలు అమలుకాకపోయిన బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా హైకోర్టు ఏర్పాటు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ఇప్పటివరకూ ఎటువంటి పురోగతీ లేదని చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలపై టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రస్తావించాలని ఆయన సూచించారు. విభజన హామీల అమలు, రాష్ట్రానికి సాధించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకూ టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర సమస్యలకు సంబంధించి ఏ ఒక్క ఎంపీ కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసే పరిస్థీతి లేదని, అధికారం మొత్తం కేసీఆర్ చేతిలో కేంద్రీకృతమైందని పొన్నం ఆరోపించారు. కాంగ్రెస్ హయంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని అన్నారు. ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని, రిజర్వేషన్ల విషయంలో వాస్తవాలకు దూరంగా ఆర్భాటమైన ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. పత్తిపంటకు చీడ పట్టినట్టే, రాష్ట్రానికి గులాబీ పీడ పట్టుకొందని, కాంగ్రెస్ పార్టీ పీను వదిలిస్తుందని పేర్కొన్నారు.